విద్యాసంస్థలు విషయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక భేటీ..!!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చిన ప్రారంభంలో మొదటిగా తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలన్నింటినీ మూసివేసింది.పరీక్షలను కూడా రద్దు చేయడం జరిగింది.

 Education Minister Sabita Indrareddy Has A Key Meeting On Educational Institutions-TeluguStop.com

ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం.విద్యాసంస్థలు క్లోజ్ చేయడం జరిగింది.

అయితే గత కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడం కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయటం తెలిసిందే.దీంతో ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ కారణంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవల పూర్తిగా రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రభుత్వం ఎత్తేసిన సంగతి తెలిసిందే.

 Education Minister Sabita Indrareddy Has A Key Meeting On Educational Institutions-విద్యాసంస్థలు విషయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక భేటీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో చాలావరకూ కార్యకలాపాలు మళ్లీ యధావిధిగా చేరుకుంటున్నాయి.ఇలాంటి తరుణంలో విద్యాసంస్థలు పున ప్రారంభం పై నేడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత అధికారులు మరియు విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీ కాబోతున్నారు.జులై మొదటి తారీకు నుండి ప్రారంభించాలని.తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.దీంతో ఫీజుల విషయంలో అదే రీతిలో విధి విధానాలు ఇంకా ఆన్లైన్ తరగతులు ప్రత్యక్ష తరగతులు వంటివాటిపై నేడు జరగబోయే ఈ సమావేశంలో తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

#Sabitha Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు