న్యూయార్క్ యూనివర్సిటీలో యూదులపై వివక్ష: దర్యాప్తునకు ఆదేశించిన విద్యాశాఖ  

Education Department Probing Alleged Anti-semitism At Nyu-ducation Department Probing,nri,semitism At Nyu,telugu Nri News Updates

ప్రతిష్టాత్మక న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో యూదు వ్యతిరేకత మరియు యూదు విద్యార్ధుల పట్ల వివక్ష చూపుతున్నట్లు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ నేపథ్యంలో విద్యాశాఖ పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటనల ఫలితంగా.వర్సిటీ ప్రాంగణంలో యూదు విద్యార్ధుల పట్ల వివక్షాపూరిత వాతావరణం ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తుదని విద్యాశాఖ పౌర హక్కుల కార్యాలయం (ఓసీఆర్) న్యాయవాదులకు పంపిన లేఖలో పేర్కొంది.

Education Department Probing Alleged Anti-semitism At Nyu-ducation Department Probing,nri,semitism At Nyu,telugu Nri News Updates Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా -Education Department Probing Alleged Anti-Semitism At NYU-Ducation Nri Semitism Nyu Telugu Nri News Updates

విద్యాశాఖ లేఖపై అటార్నీ నీల్ షేర్ స్పందిస్తూ.

ఇది చాలా సానుకూలమైన మరియు ప్రొత్సాహకరమైన చర్య అన్నారు.ఎందుకంటే తాము లేవనెత్తిన సమస్యలు చాలా తీవ్రమైనవన్నారు.కాగా న్యూయార్క్ యూనివర్సిటీ మాజీ విద్యార్ధి అడిలా కోజాబ్ తరపున ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో 7 పేజీల ఫిర్యాదును దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

పాలస్తీనా అనుకూల విద్యార్ధి సంఘమైన స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా (ఎస్‌జెపీ) అనేక కళాశాలల్లో పాలస్తీనీయన్ల కోసం పోరాడుతోందన్నారు.అయితే ఈ సంస్థ అనేక టెర్రర్ గ్రూపులతో సంబంధం కలిగిన ఒక రాడికల్ గ్రూప్ అని.

ఇది యూదు సమూహాల సాధారణీకరణ వ్యతిరేక విధానాన్ని అలవంబించడంతో పాటు యూదు రాజ్యాన్ని వేరుచేయడమో.నాశనం చేయడమో దీని లక్ష్యమని అటార్నీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బహిష్కరణ, ఉపసంహరణ మరియు ఆంక్షల ఉద్యమంలో ప్రముఖ విద్యార్ధి విభాగంగా పనిచేస్తోందన్నారు.

ఇదే సమయంలో అడేలా కోజాబ్ ఎస్‌జెపీ సంస్థ ఇజ్రాయిలీల పట్ల ప్రదర్శిస్తున్న యూదు వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.

ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానంతో పాటు బెదిరింపులు, నిరసన ప్రదర్శనలతో పాటు హింసాత్మక చర్యలకు భయపడి యూదు జాతి విద్యార్ధులు తమ యూదు గుర్తింపును బహిరంగంగా ప్రదర్శించలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో తాను అటార్నీ నీల్ షేర్ ద్వారా ఫిర్యాదు చేయించానని కోజాబ్ పేర్కొన్నారు.