‘పవర్‌స్టార్‌’ విషయంలో వర్మకు ఈడీఆర్‌ఎఫ్‌ భారీ షాక్‌

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేస్తున్న డిజిటల్‌ చిత్రాలు దుమారాన్నే రేపుతున్నాయి.ముఖ్యంగా వర్మ తెరకెక్కించిన ‘పవర్‌ స్టార్‌’ చిత్రం పెద్ద ఎత్తున వివాదాస్పదం అయ్యింది.

 Telugu Film News-TeluguStop.com

విభిన్న చిత్రాల దర్శకుడిగా ఒకప్పుడు పేరు దక్కించుకున్న వర్మ ఇప్పుడు మాత్రం వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలవడంతో పాటు అప్పుడప్పుడు ప్రభుత్వం నుండి కోర్టు నుండి మొట్టికాయలు కూడా తింటున్నాడు.తాజాగా ఈయన పవర్‌ స్టార్‌ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

ఆ సినిమా పబ్లిసిటీలో భాగంగా పోస్టర్స్‌ను హైదరాబాద్‌లో అంటించారు.
పోస్టర్స్‌ అంటించేందుకు గాను జీహెచ్‌ఎంసీ పర్మీషన్‌ లేదు అంటూ ఇప్పటికే వర్మకు ఫైన్‌ పడిన విషయం తెల్సిందే.

ఇప్పుడు మరో షాకింగ్‌ విషయం వర్మకు తలనొప్పిగా మారింది.సెంట్రల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ డీఆర్‌ఎఫ్‌ వారు వర్మకు నోటీసులు జారీ చేయడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఈ సమయంలో పోస్టర్స్‌ ఎలా వేస్తారంటూ ఆ నోటీసుల్లో ప్రశ్నించడం జరిగింది.దీనికి సంబంధించిన సమాధానం ఇవ్వడంతో పాటు వర్మ దాదాపుగా 88 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.

‘పవర్‌స్టార్‌’ విషయంలో వర్మక

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఫైన్‌ చెల్లించిన వర్మకు ఈ ఫైన్‌ కూడా పెద్ద సమస్య కాదు.కాని ఇది ఆయన పరువుకు సంబంధించిన విషయం.పదే పదే ఇలా చిన్న చిన్న విషయాలకు ఫైన్‌ చెల్లించడం ప్రభుత్వం నుండి నోటీసులు అందుకోవడం సిగ్గు చేటు అంటున్నారు.ఇప్పటికి అయినా వివాదాస్పద అంశాలను కాకుండా కాస్త మంచి సినిమాలను తీయాలంటూ ఫ్యాన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సమయంలో వర్మ మర్డర్‌ మరియు థ్రిల్లర్‌ చిత్రాలను చేస్తున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలను కూడా ఆయన త్వరలోనే శ్రేయాస్‌ ఈటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube