ఆయన సినిమా రంగానికి దూరంగా ఉండిపోయినా ఆయన పేరు, ఆయన సినిమాలు ఎప్పటికీ అలానే నిలిచిపోతాయి.ఇంతకీ ఆయన ఎవరంటే ఎడిటర్ మోహన్.
త్వరలోనే మళ్లీ తెలుగు అభిమానుల ముందుకు ఓ చక్కని చిత్రంతో వస్తానని ఆయన తెలిపారు.నిజానికి తాను చిత్ర పరిశ్రమకు దూరంగా లేనని, తమిళంలో తన పిల్లల ద్వారా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
కానీ తెలుగు వారికి దూరంగా ఉన్నానన్నది మాత్రం నిజమని, దానికి మాటల్లో చెప్పలేనంత బాధ ఉందని ఆయన అన్నారు.
మామగారు సినిమాతో గొప్ప హిట్‌ను అందించిన ఎడిటర్ మోహన్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పటివరకు మామగారు అనే వ్యక్తిని అంత గొప్పగా చెప్పిన కథ ఏ సినిమాలోనూ లేదని మోహన తెలిపారు.మామూలుగా మామగారు అంటే చాలా చులకనగా చూస్తారన్న ఆయన, ఆయన ఇంటికి వస్తే మీ నాన్న వచ్చాడు, మీ ముసలాయన వచ్చాడు అని సంబోధిస్తారు అంటూ ఆయన వివరించారు .అలాంటి వ్యక్తి గురించి ఆ రోజుల్లోనే చాలా గొప్పగా చెప్పామని ఆయన గర్వంగా చెప్పుకున్నారు.మామగారు సినిమా గురించి మాట్లాడుతూటాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు మళ్లీ రావా అంటూ ఆయన ఆ సినిమా గురించి మాట్లాడారు.
అది ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో కూడా మళ్లీ చెప్పవలసిన అవసరం లేదని మోహన్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా ఆయన తీసిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, పల్నాటి పౌరుషం లాంటి సినిమాలు ఒకప్పుడు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక మళ్లీ అలాంటి సినిమాలు ప్రస్తుత రోజుల్లో అదీ టాలీవుడ్‌లో రావడం కష్టమేనని మోహన్ వివరించారు.అసలు అలాంటి విభిన్న కథ కలిగిన చిత్రాలు రాకపోవచ్చు కూడా అని ఆయన స్పష్టం చేశారు.