వరల్డ్‌ ఫేమస్ లవర్‌కు కొత్త తలనొప్పి.. ఏమిటో తెలుసా?  

Editing Becomes Trouble For World Famous Lover-catherine Tresa,raashi Khanna,vijay Devarakonda,world Famous Lover

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నాడు ఈ అర్జున్ రెడ్డి.

Editing Becomes Trouble For World Famous Lover-Catherine Tresa Raashi Khanna Vijay Devarakonda Lover

ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పెద్ద చిక్కొచ్చి పడిందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాకు ఎడిటింగ్ చాలా తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు అడ్డుగా ఉన్న అదనపు సీన్స్‌ను తీసేయాలని దర్శకుడు క్రాంతి మాధవ్ భావిస్తున్నాడు.అయితే అవి సినిమా కథకు చాలా కనెక్ట్ అయ్యి ఉండటం, వాటిని తీసేస్తే ముందు, వెనకాల వచ్చే సీన్లు అసంపూర్తిగా ఉంటాయని దర్శకుడు, ఎడిటర్‌లు అంటున్నారు.

దీంతో ఏ సీన్‌ను ఉంచాలో, ఏ సీన్‌ను లేపేయాలో అర్ధంగాక వారు తలలు పట్టుకుంటున్నారు.ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో సీన్లు ఎక్కువ కావడం సహజం.

మరి ఈ తలనొప్పిని దర్శకుడు, ఎడిటర్ ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్య రాజేష్‌, ఇజబేల్ లీట్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలను ప్రేమించే ప్రేమికుడిగా రౌడీ అదరగొట్టనున్నాడు.

గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు

Editing Becomes Trouble For World Famous Lover-catherine Tresa,raashi Khanna,vijay Devarakonda,world Famous Lover Related....