ట్విట్టర్ లో ఎడిట్ బటన్... కాకపోతే ఓ కండిషన్...!

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ తర్వాత ట్విట్టర్ ప్రముఖంగా చెప్పవచ్చు.మొన్నటి వరకు టిక్ టాక్ మోజులో మునిగి పోయిన భారతీయులు తాజాగా దానిని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో దాని మత్తు నుండి కాస్త తేరుకుంటున్నారు.

 Edit Option In Twitter, Twitter Account, Twitter, Wear Mask-TeluguStop.com

ఇకపోతే ఇప్పటివరకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ఎడిట్ ఆప్షన్ లేదన్న విషయం అందరికీ విధితమే.ఒకవేళ ఏదైనా ట్విట్టర్ పోస్ట్ చేసే సమయంలో పొరపాటున ఏదైనా తప్పు చేసి పోస్ట్ చేస్తే దానిని ఎడిట్ చేసుకోలేము.

దానికోసం ఏకంగా డిలీట్ చేసి తిరిగి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇక ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో ఎడిట్ ఆప్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదే క్రమంలోనే ట్విట్టర్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ట్విట్టర్.అదేమనగా ట్విట్టర్ తన అధికారిక ఖాతాదారుల నుండి ఎడిట్ ఆప్షన్ ఇస్తామంటూ ప్రకటన చేసింది.అయితే ఇంతవరకు బాగున్నా కానీ, దానికి ఒక మెలిక పెట్టింది.అదేమిటంటే అందరూ మాస్కులు ధరిస్తే ట్విట్టర్ ఎడిట్ బటన్ తీసుకువస్తామని ట్విట్టర్ తెలియజేసింది.

అయితే “అందరూ అంటే అందరూ అని అర్థం” అని దానికి అనుగుణంగా మరో ట్విట్టర్ ని అనుసంధానం చేస్తూ మరో ట్వీట్ ను ట్విట్టర్ పోస్ట్ చేసింది.

Telugu Edit, Wear-

ఇలా పోస్ట్ చేసిన కొద్ది సమయానికే ఆ ట్వీట్ పై అతి తక్కువ సమయంలో భారీగా స్పందన ఇచ్చారు.ప్రపంచంలో అందరూ మాస్కులు ధరించడం సాధ్యమేనా అని నెటిజన్లు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో వారి క్రియేటివిటీని ఉపయోగించి కామెంట్లు చేస్తున్నారు.

ఒకరైతే కాస్త వెరైటీగా, ఇకపై నా పేరు ” Every One ” గా మార్చుకుంటాను అని తెలిపి, దాంతో ట్విట్టర్ లో ఎడిట్ ఆప్షన్ వస్తుందని కూడా ట్వీట్ చేశాడు.మరొక నెటిజన్ ” అందరూ అంటే డోనాల్డ్ ట్రంప్ కూడానా ” అంటూ ట్వీట్ ను ఫన్నీ కామెంట్ గా క్రియేట్ చేశాడు.

నిజానికి ఇది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి దీన్ని బట్టి మనము ట్విట్టర్ కు ఎడిట్ బటన్ ఇచ్చే ఉద్దేశం లేదని ఇట్టే అర్థమైపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube