ఈడీ అధికారుల అదుపులో డీకే, స్వల్ప అస్వస్థతకు గురయ్యారు!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ను మంగళవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.మనీ ల్యాండరింగ్ కేసు కు సంబంధించి శివకుమార్ ని గత నాలుగు రోజులుగా ఈడీ అధికారులు విచారిస్తుండగా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం తో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

 Edarrested Congress Leader Dk Sivakumar Ram Manohar-TeluguStop.com

అయితే ఆయన మంగళవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురికావడం తో రాత్రి అంతా కూడా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తుంది.ఆయన బీపీ లెవల్స్ తగ్గడం తో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.

గత ఏడాది సెప్టెంబర్లో శివకుమార్, ఇతరులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.ఆదాయ పన్ను శాఖ ఫైల్ చేసిన ఛార్జిషీట్ ఆధారంగా కాంగ్రెస్ నేతపై ఈడీ కేసు పెట్టింది.

ఇప్పటికే ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ ఆయనపై ప్రశ్నలు గుప్పిస్తోంది.శుక్రవారం నాలుగు గంటలపాటు ఆయన్ను ప్రశ్నించిన ఈడీ.శనివారం 8 గంటలపాటు ఆయన్ను విచారించింది.మనీలాండర్ నిరోధక చట్టం ప్రకారంం డీకే స్టేట్‌మెంట్‌ను రెండుసార్లు రికార్డ్ చేశారు.

డీకే శివకుమార్ విషయంలో బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.శివకుమార్ ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడలేదని మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప తెలిపారు.

Telugu Dk Sivakumar, Edcongress, Monday-

ఆగష్టు 30న శివకుమార్ తొలిసారి ఈడీ ముందు హాజరయ్యారు.విచారణకు తాను సహకరిస్తానని, చట్టాన్ని గౌరవిస్తానని ఆయన తెలిపారు.అయితే గత నాలుగు రోజులుగా ఆయనను విచారిస్తున్న ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం తో ఈడీ అధికారులు డీకే ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే శివకుమార్ అరెస్ట్‌ను ఖండిస్తూ నేడు కర్ణాటక వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube