అక్కినేని ఉమెన్స్, ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో రెండో రోజు ఈడీ సోదాలు

ED Searches On The Second Day At Akkineni Women's And NRI Hospitals

ఏపీలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.ఇప్పటికే ఎన్ఆర్ఐ సొసైటీ సభ్యులు అక్కినేని మణి, నిమ్మగడ్డ ఉపేందర్ లతో పాటు రెండు ఆస్పత్రులకు చెందిన పలువురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 Ed Searches On The Second Day At Akkineni Women's And Nri Hospitals-TeluguStop.com

ఈడీ విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చినట్లు సమాచారం.కాగా ఈ తనిఖీలలో సుమారు 40 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు.

విదేశీ నిధులు సొంత ఖాతాలకు మళ్లించినట్లు ఆధారాలు దొరికాయని తెలుస్తోంది.గుంటూరు జిల్లాలోని చిన్నకాకానిలో ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిర్మాణం జరిగింది.నిర్మాణానికి సంబంధించి రూ.40 కోట్ల వివరాలు లేవని ఈడీ గుర్తించింది.కరోనా సమయంలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు పలు రికార్డులు తారుమారు చేసినట్లు ఈడీ గుర్తించింది.ఈ నేపథ్యంలో ఇవాళ మరి కొంతమందిని అధికారులు విచారించనున్నారు.

నిన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో సుమారు 12 గంటల పాటు జరిగిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లతో పాటు హార్ట్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube