సుజనా చౌదరి కి ఈడీ సమన్లు ! ఆరువేల కోట్లు ఫ్రాడ్ జరిగిందా ..?

కొద్దీ రోజుల క్రితం వరకు ఏపీలో టీడీపీ నాయకులే టార్గెట్ గా ఆదాయపు పన్ను శాఖా , ఈడీ అధికారులు వరుసగా వారి ఆస్తులకు సంబంధించి ఆదాయ వ్యయాలు లెక్కతేల్చేందుకు రంగంలోకి దిగి రాజకీయ సంచలనం రేపింది.అయితే ఆ తరువాత కొంత విరామం తీసుకుని ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగారు.

 Ed Raids On Ex Union Minister And Tdp Mp Ys Chowdary-TeluguStop.com

ఈ రోజు ఉదయం నుంచి మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆస్తులపై సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు ఈ రోజుల ఆయనకు సమన్లు జారీ చేశారు.

ఈ నెల 27వ తేదీన తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఆదేశాలు జారీ చేసింది.రెండు రోజులుగా ఐటీ, ఈడీ అధికారులు సుజనా కార్యాలయాల్లో ఇంకా.సోదాలు నిర్వహిస్తున్నారు.

బెస్ట్ క్రోప్టస్ అండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు లిమిటెడ్‌పై ఫిర్యాదు చేశాయి.సెంట్రల్ బ్యాంకు నుండి రూ.133 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుండి రూ.71 కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు నుండి రూ.159 కోట్లు రుణాలను తీసుకొని బ్యాంకులను మోసం చేసినట్టు ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేసింది.

ఈ కేసులో భాగంగానే రెండు రోజులుగా ఐటీ, ఈడీ అధికారులు సుజనా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.సుజనా చౌదరి ఉపయోగిస్తున్న ఆరు కార్లు కూడ నకిలీ కంపెనీలపై రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఈడీ ప్రకటించింది.సుజనా గ్రూప్ కంపెనీలు రూ.5700 కోట్లకు పైగా మోసం చేసినట్టు ఈడీ గుర్తించింది.నాగార్జున హిల్స్ లో వివిధ షెల్ కంపెనీల్లో 126 రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకొన్నట్టు ఈడీ తెలిపింది.

ఈ కంపెనీలన్నీ కూడ సుజనా గ్రూపుకు చెందినవిగా ఈడీ ప్రకటించింది.

తన కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా పెట్టి.షెల్‌ కంపెనీలు సుజనాచౌదరిపై ఆరోపణలు ఉన్నాయి.గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, తేజస్విని ఇంజినీరింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ తదితర డొల్ల కంపెనీలకు ఆయన పెద్ద ఎత్తున డబ్బు తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ ఆరోపణలపై 2016 ఫిబ్రవరిలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.ఈ కేసులో 2017 ఫిబ్రవరి, 2018 జులైలో మరోసారి ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది.గత అక్టోబర్‌లో ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించి.పెద్ద ఎత్తున హార్డ్‌డిస్క్‌లు, ఫైల్స్‌తోపాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.ఇక, మూడు బ్యాంకుల నుంచి రూ.304 కోట్ల రూపాయల రుణం తీసుకొని వాటిని దుర్వినియోగపరిచినట్టు ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube