ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ సోదాలపై ఈడీ ప్రకటన

ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ సోదాలపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కీలక ప్రకటన చేసింది.ఈ మేరకు 53 చోట్ల స్థిరాస్తులను ఈడీ అధికారులు గుర్తించారు.

 Ed Notification On Nri Medical College Searches-TeluguStop.com

విజయవాడ, కాకినాడ, గుంటూరుతో పాటు హైదరాబాద్ లో ఈనెల 2, 3 వ తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ తనిఖీలలో నగదుతో పాటు పలు కీలక పత్రాలు, ఆస్తులను సీజ్ చేశామని తెలిపింది.

ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది.కరోనా సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారని పేర్కొంది.

ఆ ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని ఈడీ గుర్తించింది.అదే విధంగా ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి అడ్మిషన్ల పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని, ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుంచి ఎన్ఆర్ఐఏఎస్ అనే మరో ఖాతాలకు బదిలీ చేశారని ఈడీ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube