బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు( BRS MLC Kavitha Arrest )పై ఈడీ చేసిన ప్రకటనను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది.ఈడీ ప్రకటనలో ఒక్క కొత్త విషయం కూడా లేదని పేర్కొంది.
ఈడీ అవాస్తవ ప్రకటనలు విడుదల చేస్తోందని ఆప్( Aam Aadmi Party ) మండిపడింది.రూ.100 కోట్ల ముడుపులన్నారు.కానీ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని చెప్పింది.
బీజేపీ పొలిటికల్ వింగ్ లా ఈడీ( ED ) పని చేస్తోందని ఆరోపించింది.లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆప్ పేర్కొంది.
లిక్కర్ స్కాం కేసులో ఆధారాలు దొరకకపోవడంతో ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.







