టీ.ఆర్.ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇళ్లు, ఆఫీస్ లపై ఈడీ సోదాలు..!

టీ.ఆర్.ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరెట్ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు.మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటుగా మరో ఐదు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.

 Ed Conduct Searches At Nama Nageswara Rao Resident And Offices-TeluguStop.com

రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు.ఖమ్మంలో కీలక నేత అయిన నామా నాగేశ్వర రావు ఇళ్లు, ఆఫీస్ ల మీద ఈడీ సోదాలు షాక్ ఇస్తున్నాయి.

మధుకాన్ డైరక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం.రాంకీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలను తప్పుదారి పట్టించారనే అభియోగాల మీద ఈ సోదాలు జరుగుతున్నాయి.

 Ed Conduct Searches At Nama Nageswara Rao Resident And Offices-టీ.ఆర్.ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇళ్లు, ఆఫీస్ లపై ఈడీ సోదాలు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సంస్థల బ్యాంక్ ఖాతాలు, డాక్యుమెంట్స్, కాంట్రాకులకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.సోదాలతో నామా నాగేశ్వ రావ్వు ఇళ్లు, ఆఫీసులలో కొద్దిపాటి హడావిడి కొనసాగుతుంది.

అయితే ఈడీ సోదాల్లో ఎలాంటి వివరాలు సేకరిస్తారు.రుణాలు తీసుకుని నిజంగానే వాటిని తప్పుదారి పట్టిచినట్టు ఆదారాలు సేకరించారా.

వీటి వివరాలు సోదాలు పూర్తయిన తర్వాత తెలుస్తాయి.

#Offices #RamkiExpress #Trs Mp #Conduct #Residen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు