ఎన్నికల ముందు సుజనా చౌదరిపై కొరడా ఝులిపించిన ఈడీ

గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో రాజకీయాలలో ఉన్న వ్యాపారవేత్తలపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ విస్తృతంగా దాడులు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఆదాయానికి మించిన ఆస్తులు, అలాగే పన్ను ఎగవేత వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ, అలాగే బ్యాంకులకి భారీగా కుచ్చుటోపీ పెట్టి రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది.

 Ed Attach Sujana Chowdary Property To Bank-TeluguStop.com

అయితే తెలుగు దేశం పార్టీ వీటిని రాజకీయంగా ఎన్నికలలో వాడుకునే ప్రయత్నం చేస్తుంది.బీజేపీని వ్యతిరేకించే వారిపై ఈడీ దాడులు చేస్తుందని ఆరోపిస్తు విమర్శలు చేస్తునారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈడీ తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి భారీ షాక్ ఇచ్చింది.సుజనా గ్రూప్ కంపెనీలు బ్యాంకులకు పెద్దమొత్తంలో బకాయి పడినట్లు ఇప్పటికే ఆధారాలతో సహా రుజువైంది.

ఈ నేపధ్యంలో సుజనా గ్రూపు కంపెనీలు బ్యాంకు కు బకాయి పడిన 315 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.సుజనా గ్రూపు కంపెనీలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి 315 కోట్లు ఫ్రాడ్ చేశాయన్న ఆరోపణలు నేపధ్యంలో, అలాగే బ్యాంకుల నుంచి షెల్ కంపెనీల మీద తీసుకున్న రుణాలను మిగిలిన కంపెనీలకు బదలాయించాయనే ఆరోపణలతో సుజనాకంపెనీలకు చెందిన 315 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube