ఏంటేంటి ? టీడీపీ తరపున పోటీ చేస్తే ఈ గిఫ్ట్ లు ఖాయమా ?

మొన్నటివరకు తమకు తిరుగే లేదు అన్నట్టుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు రోజురోజుకి మారుతూ వస్తున్నాయి.ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీకి అభ్యర్థులే లేనట్టుగా కనిపిస్తోంది.

 Ed And It Raids Tdp Mp Candidates-TeluguStop.com

ఎందుకంటే ఇప్పటివరకు సిట్టింగ్ లు అంతా మళ్ళీ పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తుండడంతో కొత్త అభ్యర్థుల వేటలో టీడీపీ ఉంది.ఈ పరిస్థితి రావడం వెనుక పెద్ద కారణమే టీడీపీపై టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆ పార్టీ అనుమానిస్తోంది.

సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారడం వెనుక కూడా పెద్ద కథే ఉన్నట్టు ఆ పార్టీ కొన్ని ఆధారాలు సంపాదించగలిగింది.చంద్రబాబుకు సన్నిహితుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌తో పాటు తోట నరసింహం కూడా ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పసారు.

తాజాగా మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగంట శ్రీనివాసులు రెడ్డి కూడా చంద్రబాబు కు ఇదే విషయాన్ని చెప్పారు.దీంతో పాటు కీలకమైన ఓ విషయాన్ని బాబు చెవిన వేశారు.

టీడీపీ తరపున పోటీ చేసేవారిని ఈడీ, సిబిఐ అంటూ భయపెడుతున్నారని, అవి ఎదుర్కునే ధైర్యం లేక కాదు , ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్న క్రెడిబిలిటీని ఈ కక్ష్య సాధింపు రాజకీయాల కోసం దెబ్బతీసుకోటం ఎందుకని పోటీ చేయడంలేదు అంటూ తన ఆవేదనను బాబు కి వివరించాడట.ఈ మధ్యనే టీడీపీ గుంటూరు అభ్యర్థి గల్లా జయదేవ్ మీద ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

గతంలో హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం తరచూ తిరగడం ఇబ్బంది అవుతుందని మురళీ మోహన్, ఆరోగ్య కారణాల వల్ల తోట నరసింహం ఈ సారి పోటీ చెయ్యలేమని తప్పుకున్నారు.తాజా పరిస్థితులను బట్టి వారిని కూడా ఏమన్నా బెదిరించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇక నరసాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణమ రాజు విషయంలో కూడా ఇదే జరిగిందని ఆయన పార్టీ మారకపోతే తమిళనాడులో ఆయన కంపెనీ చేసిన పనుల బిల్లులు ఆపేస్తామనే భేదిరింపు వచ్చిందని అందుకే ఆఘమేఘాల మీద పార్టీ మారారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.అలాగే అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు విషయంలో కూడా ఇదే జరిగినట్టు రాజకీయా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube