Kailash Gahlot : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. మరో ఆప్ మంత్రికి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.

ఈ మేరకు ఢిల్లీకి చెందిన మరో ఆప్ నేతకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్( Kailash Gahlot ) కు ఈడీ నోటీసులు జారీ చేసింది.ఆయన ఇవాళే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

కాగా లిక్కర్ కుంభకోణం సమయంలో కైలాశ్ గెహ్లాట్ పలుమార్లు ఫోన్ నంబర్ మార్చారని ఈడీ పేర్కొంది.

అదేవిధంగా మద్యం కేసులో నిందితుడుగా ఉన్న విజయ్ నాయర్( Vijay Nair ) కు గతంలో కైలాశ్ ఆశ్రయం ఇచ్చారని ఈడీ ఆరోపిస్తుంది.అయితే ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు