వావ్... చెక్కతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లి కారును చూశారా మీరు...?

కొందరికి కారు నడపాలంటే మహా సరదా.పాత కార్లు కొనుగోలు చేసి మరి తోలేస్తుంటారు.

 Have You Ever Seen An Eco Friendly Car Made Of Wood  Eco Friendly Car, Wood, Lon-TeluguStop.com

లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు, బ్రాండెడ్ కార్లు కొనుగోలు చేసి లాంగ్ డ్రైవ్ లకు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వెళ్లాలనుకుంటారు.హైవేలపై యమ స్పీడ్ లో దూసుకెళ్లాలని ఆశపడుతుంటారు.

అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన కార్లు ఐరన్, ఉక్కు, అల్యూమినియంతో తయారు చేసినవి.కొందరు ధనవంతులు కార్లపై వజ్రాలు కూడా పొదిగించుకున్నవార్తలు విని ఉంటాం.

అయితే ఇప్పటివరకూ ఎవరూ చెక్కతో తయారు చేసిన కారును చూసి ఉండరు.

చెక్కతో తయారు చేసిన కారును మీరెప్పుడైనా చూశారా?.పోనీ అసలు విన్నారా…? కింద బేస్ మొత్తం లోహంతో తయారు చేసి పైన చెక్కతో రూపొందించిన ఓ ఎకో ఫ్రెండ్లీ కార్ గురించి మనం తెలుసుకోవాల్సిందే.19వ శతాబ్దంలోనే చెక్కతో తయారు చేసిన కార్లు అందుబాటులో ఉండేవి.అయితే అప్పటి పాలనలో కారు తయారీ యజమానులు కేవలం వారి సొంత అవసరాలకే వాడుకునే వారు.వారితో పాటు అప్పటికాలంలో పైస్థాయి అధికారులు, ధనవంతులు చెక్కతో తయారు చేసిన కార్లను వినియోగించేవారు.

1978వ సంవత్సరంలో విలియమ్స్ టౌన్స్ రూపొందించిన ఇంటర్ స్టైల్ కారును తయారు చేశారు.అయితే ఈ కారు పర్యావరణహిత మోడల్.

విలియమ్స్ అప్పట్లో ప్రాచుర్యం పొందిన ఆస్టిన్ మార్టిన్ లగోండా మోడల్ ను సృష్టించాడు.కింద బేస్ స్టీల్ తో, గ్లాస్ తో తప్ప మిగిలిన పార్టులన్నీ చెక్కతోనే తయారు చేశారు.ఈ ఇంటర్ స్టైల్ కారు తయారీకి హెడ్ లైట్స్ ను హిల్ మాన్ హంటర్, టైయిల్ లైట్స్ ను ట్రింఫ్ డోలోమైట్ ను తెప్పించుకున్నాడు.1982వ సంవత్సరంలో మోడల్ హస్టర్ ఉడెన్ వేరియంటెడ్ తో అత్యున్నత నైపుణ్యం కలిగిన వడ్రంగులతో విడి భాగాలు తయారు చేయించాడు.కారు తలుపులు పెద్దగా ఉండి సామాన్లు పెట్టుకునే విధంగా అనుకూలంగా తయారు చేయించాడు.ముందు వెనుక భాగంలో రెండు సీట్లు చెక్కతోనే తాయారు చేయించాడు.ఇక ఆ కార్ నడిపినప్పుడు కుదుపుల వద్ద కాస్త శబ్దం వస్తుంది.ఈ కార్ తో దగ్గర ప్రయాణాలు ఓకే కానీ, దూరప్రయాణాలు మాత్రం సాధ్యం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube