ఎన్ఆర్ఐల ఓటు హక్కుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్( Rajeev Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఎన్ఆర్ఐలకు ఓటు హక్కును వినియోగించుకునేలా అనుమతించేందుకు ‘‘ఈ – పోస్టల్’’ బ్యాలెట్ల వంటి సాంకేతిక పద్ధతులను అనుసరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.1952 నుంచి భారతదేశంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి.సకాలంలో ఫలితాలను విడుదల చేస్తున్నామని సీఈసీ తెలిపారు.

ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో( Nirvachan Sadan, Delhi ) (ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం) జరిగిన 2022 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి రాజీవ్ కుమార్ ప్రసంగిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆయన ప్రసంగించారు.విదేశాల్లో వున్న ఎన్ఆర్ఐల( NRI ) ఓటు హక్కు గురించి ప్రస్తావించిన సీఈసీ.ప్రవాస భారతీయుల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్) సదుపాయాన్ని ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కాగా .ఈటీపీబీఎస్‌ను అమలు చేసే విధానానికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదించి ఈసీ రాజ్యసభకు వివరాలు తెలియజేసింది.2023 జనవరి 1 నాటికి విదేశాల్లో ఉన్న భారతీయ ఓటర్ల సంఖ్య 1.15 లక్షల పైమాటే.గణాంకాల ప్రకారం వివిధ దేశాల్లో మొత్తం 3.2 కోట్లమంది భారతీయులు నివసిస్తున్నారు.వీరిలో ప్రవాస భారతీయులే కాక, దశాబ్ధాల క్రితం విదేశాలకు వెళ్ళి స్థిరపడిన భారత సంతతి (పీఐఓ) ప్రజలూ ఉన్నారు.పీఐఓలకు ఆయా దేశాల పౌరసత్వం ఉంటుంది కాబట్టి వారు భారత్‌లో ఓటు వేయడానికి అనర్హులు.
కానీ, ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) ఇంకా భారత పౌరులే కాబట్టి, 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 20ఎ కింద స్వదేశంలో ఓటు వేసే అర్హత ఉంటుంది.మరోవైపు.
విదేశీ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రజా ప్రతినిధ్య చట్టం, 1951 సవరణను వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం 2021 నవంబర్ 27న న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.ఈటీపీబీఎస్‌ను సర్వీస్ ఓటర్ల కోసం 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పరీక్షించారు.
