కలెక్టర్ ని సస్పెండ్ చేసిన ఈసీ ! కారణం ఇదే  

Ec Suspended Vikarabad District Collector-

The Central Election Commission has suspended a collector who has acted against the election commission rules regulation. If the full details of the case were discussed, the EVMs were opened against the rules and the Congress candidate Gaddam Prasad complained that the disruption in the Vikarabad constituency had been complained of. AICCC Election Commission chairperson Marri Shashidhar Reddy, a party delegation complained to the collector of Telangana state chief Rajat Kumar in the Secretariat.

.

ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఓ కలెక్టర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసి సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే…. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను తెరిచారని, వికారాబాద్‌ నియోకవర్గంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏఐసీసీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ను కలిసి కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది..

కలెక్టర్ ని సస్పెండ్ చేసిన ఈసీ ! కారణం ఇదే -Ec Suspended Vikarabad District Collector

ఇదే విషయమై ప్రసాద్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేసినప్పటికీ, కలెక్టర్‌ ఈవీఎంలను తెరవడంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కలెక్టర్ సుమారు వంద ఈవీఎంల ను ఓపెన్ చేసారంటూ… కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ సయ్యద్ ఉమర్ జలీల్‌‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ…. ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.