ఆర్టికల్ 321 ని ప్రయోగించి బెంగాల్ రాజకీయాల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

 Ec Shocking Decision On Bengal Politics 321-TeluguStop.com

అంతేకాకుండా ఇటీవల జరిగిన ఆరో దశ ఎన్నికల సమయంలో కూడా బెంగాల్ లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.ఈ నేపథ్యంలో తుది విడత ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.

గడువు కంటే ఒక్క రోజు ముందే బెంగాల్ లో ప్రచారం ముగించాలి అంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.కేంద్ర ఎన్నికల తొలిసారి గా ఆర్టికల్ 321 ను ప్రయోగించి పై మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో బెంగాల్ లోని మొత్తం 9 నియోజకవర్గాల్లో గురువారం రాత్రి 10 వరకు మాత్రమే ప్రచారానికి అనుమతినిస్తూ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది

మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీ లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే.గుర్తు తెలియని వ్యక్తులు షా వాహనం పై కర్రలు,రాళ్లు విసరడం తో బీజేపీ నేతలు కూడా అదుపుతప్పి ఘర్షణకు దిగారు.

విద్యాసాగర్ కాలేజీ దగ్గర పలు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు.కాలేజీ సమీపంలో ఉన్న ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారు.

దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.అయితే ఈ ఘర్షణకు కారణం మీరంటే మీరంటూ ఒకరిపై నొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

మరోపక్క బెంగాల్ సి ఎం మమతా బెనర్జీ ఆకస్మిక పాద యాత్ర చేపట్టడం తో అక్కడ భద్రతను మరింత పటిష్టం చేశారు.అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 321 ని ఉపయోగించి గడువుకు ఒక్క రోజు ముందే బెంగాల్ లో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఉత్తరువులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube