సోషల్ మీడియాపై నిఘా ... పాలి'ట్రిక్స్' కుదరవట  

జనాలకు ఇప్పుడు జనాలకు సాధారణ మీడియా బోర్ కొట్టేసింది. ఇప్పుడు నడుస్తున్న అంతా సోషల్ మీడియా హవానే. ప్రపంచంలో ఎక్కడైనా ఏది జరిగిన సోషల్ మీడియాలో క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణ మీడియా కూడా సోషల్ మీడియాను సోర్స్ గా చేసుకుని వార్తలు వార్తలను వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఎన్నికల సమయంలో అయితే … సోషల్ మీడియాలో రాజకీయ పోస్టింగులకు కొదవే ఉండదు. నాయకులు, పార్టీలు సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుని జనాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ ఇలా దేన్నీ వదలకుండా అన్నిటిని వాడేసుకుంటున్నారు.

EC Seriously Puts Concentrates Social Media About Political Posts-Kcr Mahakutami Social Posts Telangana Elections Trs

EC Seriously Puts Concentrates Social Media About Political Posts

ప్రస్తుతం తెలంగాణ విషయానికి వస్తే … ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. నాయకులు ప్రచారం చేసుకోవాలంటే… బహిరంగంగా కుదరని పని. దీంతో ఇప్పుడు వీరంతా సోషల్ మీడియా మీద ఆధారపడ్డారు.ఫేస్ బుక్ ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఎన్నికల ప్రచారం పరోక్షంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాపై ప్రస్తుతానికి పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో నాయకులంతా వీటిపైన పడ్డారు. అంతేకాదు ప్రత్యేకించి అభ్యంతరకర దృశ్యాలను వీడియో ఫోటోలను ఫేస్ బుక్ లో వీటిలో పెట్టి తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఎవరినైనా కించపరుస్తూ పోస్టులు పెడితే ఆ విషయాన్ని ఎవరైనా… ఫిర్యాదు చేస్తే ఐటీ చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

EC Seriously Puts Concentrates Social Media About Political Posts-Kcr Mahakutami Social Posts Telangana Elections Trs

అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టులను పరిశీలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. సోషల్ మీడియా లో వచ్చే రాజకీయ పార్టీల వార్తలకు సంబంధించి ఎప్పటికప్పుడు అభ్యంతరకరమైన పోస్టులు ఉంటే వాటిని పరిశీలించి వాటిని రికార్డు చేసుకుంటున్నారు పోలీసులు. మరి అభ్యంతరకరంగా ఉంటే వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయినా సోషల్ మీడియా లో రాజకీయ పార్టీల పోస్టింగ్ లతో కళకళలాడుతూ కనిపిస్తోంది. ఎవరికి వారు తమ తమ ఖాతాల నుంచి తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ… నచ్చిన నాయకులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అయితే కాంట్రవర్సి లేకుండా ఎవరు ఏ పోస్టింగ్ పెట్టుకున్నా అభ్యంతరం లేదని … కానీ వేరొకరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రం చిక్కుల్లో పడాల్సిందే అని పోలీసులు చెబుతున్నారు.