ఎన్నారైలకి క్లారిటీ ఇచ్చిన...ఈసీ  

  • వచ్చే లోక్ సభ ఎన్నికల నుంచే ఎన్నారైలు ఓటు వేయవచ్చని జరుగుతున్నా ప్రచారం అబద్దమని తేల్చింది భారత ఎన్నికల సంఘం. సోషల్ మాధ్యమాలలో వస్తున్న వార్తలు నమ్మవద్దని, ఎన్నారైలకి ఆన్లైన్ ఓటింగ్ లేదని మరొక సారి స్పష్టం చేసింది. ఈ మేరుకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

  • EC Notice To NRI People About AP Elections-Ec Nri Nri Ap Elections Telugu News Updates

    EC Notice To NRI People About AP Elections

  • వాట్సాప్, పేస్బుక్ వంటి మాధ్యమాలలో వస్తున్న వార్తలు నమ్మవద్దని, అందులో వస్తున్నట్టుగాఎవరికీ ఆన్‌లైన్ ఓటింగ్ అవకాశం ఇవ్వలేదని తేల్చి చెప్పింది. అయితే ప్రవాసులు ఆన్‌లైన్లో 6ఏ ఫామ్ నింపి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, కానీ ఓటు వేయాలంటే మాత్రం ఎంచుకున్న పోలింగ్ బూత్ వద్దకి వెళ్లాలని చెప్పింది.

  • EC Notice To NRI People About AP Elections-Ec Nri Nri Ap Elections Telugu News Updates
  • పాస్‌పోర్టును చూపించి కూడా ఓటు వేయచ్చని తెలిపింది.తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకి ఫిర్యాదులు చేశామని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయకుండా ఎన్నారైలకు ఆన్‌లైన్లో ఓటు వేసే అవకాశం ఇవ్వలేమని తెలిపింది.