చిక్కుల్లో ఏపీ ప్రభుత్వం… సాక్షాలతో నిమ్మగడ్డ ?   

ec nimmagadda Ramesh Kumar vs ap government, Nimmagadda Ramesh Kumar, YS Jagana, Supreme Court, - Telugu Ap Election Commissioner, Chandrababu, Governor, Jagan, Kodali Nani, Local Body, Nimmagadda Ramesh Kumar, Tdp, Ysrcp

కొద్ది నెలలుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తోంది.గత ఫిబ్రవరిలోనే ఈ తంతు ప్రారంభమైంది.

TeluguStop.com - Ec Nimmagadda Ramesh Kumar Vs Ap Government

చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి.ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో , అకస్మాత్తుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ పార్టీ లకు సమాచారం ఇవ్వకుండా ఆకస్మాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయడం వివాదాస్పదమైంది.

దీనిపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిమ్మగడ్డ పై విమర్శలు చేసింది.అక్కడితో ఆగకుండా, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా కొత్త ఎన్నికల అధికారిని నియమించింది.

TeluguStop.com - చిక్కుల్లో ఏపీ ప్రభుత్వం… సాక్షాలతో నిమ్మగడ్డ  -General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ వ్యవహారంపై నిమ్మగడ్డ సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ అనుకూలంగా తీర్పు రావడంతో మళ్లీ ఏపీ ఎన్నికల అధికారిగా ఆయన నియమితులయ్యారు.

 ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ ఏపీలో ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తుండగా,  అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండటం , ఈ వ్యవహారాల మధ్య అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

వైసీపీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు నిమ్మగడ్డ పై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేయడం వంటి వ్యవహారాలపై ఆయన నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.అలాగే ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్లు,  ఇతర కీలక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించేందుకు రెండు సార్లు ప్రయత్నించారు.

ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ కి లేఖ రాసినా,  ఎన్నికల నిర్వహణలో తాము పాల్గొనమనే సమాధానం చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చింది.అయితే ప్రభుత్వం నుంచి ఈ సమాధానం వస్తుందని ఊహించే నిమ్మగడ్డ రెండుసార్లు లేఖ రాసినట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

గవర్నర్ కు చేసిన ఫిర్యాదు, చీఫ్ సెక్రటరీ రాసిన లేఖలు, వైసీపీ మంత్రులు,  ఎమ్మెల్యేలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇలా అన్నిటినీ నిమ్మగడ్డ సేకరించుకున్నట్లు తెలుస్తోంది.రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ వ్యవస్థలను తక్కువ చేసి ఇబ్బందులకు గురి చేస్తుంది అనే విషయాన్ని అధికారికంగా నిరూపించేందుకు నిమ్మగడ్డ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఈ పరిస్థితులు అన్నిటిని తనకు అనుకూలంగా మార్చుకుని, ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా నిమ్మగడ్డ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఏది ఏమైనా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

#Kodali Nani #Ysrcp #Chandrababu #Governor #Local Body

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ec Nimmagadda Ramesh Kumar Vs Ap Government Related Telugu News,Photos/Pics,Images..