పోలింగ్ నమోదు శాతం ప్రకటించిన ఈసీ,అసలు ఏమి జరుగుతుంది అంటున్న ఆప్

ఈనెల 8 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.మొత్తం 1.4 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీ లో దాదాపు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ప్రతి పార్టీలు కూడా కోరుకున్నాయి.అయితే పోలింగ్ రోజును ఎంతమేరకు పోలింగ్ నమోదు అయ్యింది అన్న విషయం ఎన్నికల అధికారులు తేల్చి చెప్పేస్తారు.

 Ec Announces Final Poll Percentage Of Delhi Elections-TeluguStop.com

కానీ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం అది జరగలేదు.ఎన్నికలు ముగిసిన 24 గంటల తరువాత ఈసీ అధికారులు పోలింగ్ శాతం 62.59 శాతం మాత్రమే నమోదు అయినట్లు తెలపడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.అసలు పోలింగ్ ముగిసిన ఒక రోజు తరువాత ఓటింగ్ శాతాన్ని ప్రకటించడం ఏంటి అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈసీ తీరు తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఎన్నికల సంఘం అధికారులు నిద్రపోతున్నారా? పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత ఓటింగ్ శాతాన్ని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.ఈవీఎంను ట్యాంపర్ చేసే కుట్ర జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా ఆప్ నేతలు పోస్ట్ చేస్తున్నారు.అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఆప్ నేతల ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.ఖచ్చితమైన సమాచారం అందించడం కోసమే ఆలస్యం జరిగిందని, కొన్ని చోట్ల పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్ల క్యూలో నిల్చోవడం వల్ల పోలింగ్ శాతంపై క్లారిటీ రాలేదన్నారు.పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి 10.17కు 61.43శాతం పోలింగ్ జరిగినట్లు తాము యాప్‌లో అప్‌డేట్ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారి రణ్‌బీర్ సింగ్ చెప్పారు.మొత్తం డాటా ఎన్నికల సంఘానికి వచ్చి, దాన్ని అనలైజ్ చేసేసరికి ఆలస్యం అయిందని, అందుకే పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించామని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు.బాబర్ పూర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో కొన్ని ఈవీఎంలను వాడకుండా పక్కన పెట్టినట్లు తాము గుర్తించినట్లు ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.

Telugu Day, Arvind Kejriwal, Bjp, Delhi-Telugu Political News

ఢిల్లీలో మొత్తం70 స్థానాలకు పోలింగ్ జరుగ్గా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67స్థానాలను గెలుచుకుంది.మరి ఈ సారి ఎలాంటి ఫలితాలు వెలువడతాయో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.8 వ తేదీన జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11 న వెలువడనున్న విషయం తెలిసిందే.అయితే చాలా సర్వే లలో కూడా ఈ సారి కూడా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపడతారంటూ తెలిపాయి.

మరి ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube