ఈబీ-5 వీసా ఫీజు పెంపు: భారతీయుల జేబుకు చిల్లే  

EB-5 Visa: Indians Will Pay $50,000 More For US Investor Visa From April - Telugu $50, 000, 000 More For Us Investor Visa From April, April, Eb-5 Visa, Eb-5 Visa: Indians Will Pay $50, Green Card, Indians, Investor Visa, Nri, Permanent Resident, Telugu Nri News, Us

ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు వలస వెళ్లాలనుకునే భారతీయులకు ఇమ్మిగ్రేషన్ రుసుము కింద జేబులకు చిల్లులు పడనుంది.ఈబీ-5, ఇన్వెస్టర్ వీసా కోసం అదనంగా 50,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.ఈ అదనపు రుసుము అన్ని వీసా కేటగిరీలపై ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రధానంగా ఈబీ-5 వీసా కింద పెట్టుబడులు పెట్టే వారికి అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అమెరికన్ బజార్ దినపత్రిక తన కథనంలో ప్రచురించింది.

Eb-5 Visa: Indians Will Pay $50,000 More For Us Investor Visa From April

ఈ ఏడాది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌లో భాగంగా కనీస పెట్టుబడిని 1990ల తర్వాత 9,00,000లకు పెంచింది.

కనీస పెట్టుబడిలో ఈ పెరుగుదలలో 5 శాతం అదనపు పన్నును దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ప్రక్రియ కోసం అమెరికాలో ఎస్క్రోఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.అమెరికాకు వెళ్లేముందు భారతీయులు తమ పన్ను స్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అమెరికన్ బజార్ గ్లోబల్ ఛైర్మన్ మార్క్ డేవిస్ అన్నారు.

చైనా, వియత్నాం, భారతీయుల నుంచి ఈ వీసాకు డిమాండ్ ఎక్కువగా ఉంది.హెచ్ 1 బీ వీసాల ద్వారా గ్రీన్‌కార్డు లభించడం ఇటీవల పదేళ్లకుపైనే పడుతోంది.అదే ఈబీ 5 వీసా ద్వారా దరఖాస్తు చేస్తే 3 నుంచి 5 ఏళ్లలోనే గ్రీన్‌కార్డ్ లభిస్తుంది.దీంతో సంపన్న భారతీయులతో పాటు హెచ్ 1 బీ వీసాలపై వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది ఈ వీసాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

అమెరికాలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు 1993లో ఈబీ-5 వీసా పథకాన్ని ప్రారంభించారు.ఈ విధానంలో కనీసం 10 ఉద్యోగాలు కల్పించేలా 5 లక్షల డాలర్ల కనీస పెట్టుబడి పెట్టే విదేశీయులకు ఈ వీసాల కింద గ్రీన్‌కార్డ్ జారీ చేస్తారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు