ఊతప్ప పట్టు.. కరోనాను తరిమికొట్టు!  

Eating Small Onions Can Prevent Corona Virus Says Tamilnadu Hotel - Telugu Corona Virus, Small Onions, Tamil Nadu Hotel, Weird News

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి అందరికీ తెలిసిందే.ఈ వ్యాధి చైనా దేశాన్ని అతలాకుతులం చేస్తోంది.

Eating Small Onions Can Prevent Corona Virus Says Tamilnadu Hotel

వేలాది మంది ఈ వ్యాధి బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.కాగా ఇప్పటికే ఆ దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ వైరస్ తాజాగా భారతదేశానికి కూడా వ్యాప్తి చెందినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ కరోనా వ్యాధిని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.

కాగా తమిళనాడుకు చెందిన ఓ హోటల్ వారు చెబుతున్నారు.కారైకుడిలోని ఓ హోటల్‌లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ, నువ్వుల నూనెతో చేసిన ఊతప్ప తింటే కరోనా వైరస్‌ను అరికట్ట వచ్చని ఆ హోటల్ యజమాని అంటున్నారు.

దీనికి సంబంధించి ఏకంగా హోటల్ ముందు ఓ బోర్డు కూడా పెట్టాడు.

ఈ బోర్డు ప్రస్తుతం తమిళనాడులో హల్‌చల్ చేస్తోంది.

ఏదేమైనా కరోనా వైరస్ ప్రస్తుతం భారతదేశాన్ని వణికిస్తోంది.ఈ వ్యాధి ఇక్కడి జనాలను భయాందోళనకు గురి చేస్తోంది.

మరి నిజంగానే ఊతప్ప తించే కరోనా వైరస్ సోకకుండా ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు