Oats For Breakfast: ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్!

ఓట్స్. వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 Eating Oats For Breakfast Has Many Health Benefits Including Weight Loss Details-TeluguStop.com

హెల్త్‌, ఫిట్‌నెస్ పై శ్ర‌ద్ధ వ‌హించే ప్రతి ఒక్కరు ఓట్స్ ను తమ డైట్ లో చేర్చుకుంటారు.అయితే ఓట్స్ బరువు తగ్గడానికే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను సైతం అందిస్తాయి.

ముఖ్యంగా ఓట్స్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఓట్స్ ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసుకోవాలి.అలాగే ఒక కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.గంట అనంతరం వాటర్ తొలగించి ఓట్స్ ను పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి స్పూన్ తో స్మాష్ చేసుకుని ఒక బాక్స్ లో వేసుకోవాలి.

ఆ త‌ర్వాత‌ అదే బాక్స్ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, నాన‌బెట్టుకున్న ఓట్స్, ఒక గ్లాస్ హోమ్ మేడ్ ఆల్మండ్ మిల్క్‌, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Breakfast, Tips, Latest, Oats, Oats Benefits-Latest News - Telugu

ఆ తర్వాత మూత పెట్టి బాక్స్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఓవర్ నైట్ ఓట్స్ ను తీసుకోవాలి.

ఈ విధంగా ఓట్స్ ను తీసుకుంటే అతి ఆకలి దూరం అవుతుంది.

మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.దాంతో బరువు తగ్గుతారు.

అంతేకాదు ఓట్స్ ను పైన చెప్పిన విధంగా తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.రోజంతా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.

మెదడు చురుగ్గా పని చేస్తుంది.ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మరియు గుండె ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube