Eating food with spoons is not healthy  

Eating Food With Spoons Is Not Healthy-

చాలా మంది అన్నం తినాలన్నా .టిఫిన్ చేయలన్నా స్పూన్స్ ని వాడటం ఎక్కువగా జరుగుతోంది..

-

ఆకరికి మంచినీళ్ళు కూడా స్ట్రా వేసుకుని త్రాగుతున్నారు అంటే మన ఆహార నియమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్పూన్స్ తో తినడం ఒక స్టైల్. హోటల్స్ కి వెళ్ళినప్పుడు చేతితో తినడడం అదేదో అపరాధంలా ఇబ్బంది పడిపోతారు.

కానీ మన పూర్వీకులు ఏ పనిచేసినా దానిలో అర్థం ఉంటుంది. తాజాగా చేసిన అధ్యయనాల ప్రకారం స్పూన్‌తో స్టయిలిష్‌గా తినడం చాలామందికి అలవాటైపోయింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వారు చెప్పినదాని ప్రకారం ఆహారాన్ని చేయి తాకగానే ఙ్ఞాన‌నాడుల ద్వారా మెదడు, పొట్టకు సంకేతాలు అందుతాయి. దీంతో జీర్ణరసాలు, ఎంజైములు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. అంతేకాదు.

చేతితో ఆహారం తినడడం వలన శరీరానికి ఒకరకమైన వ్యాయామం జరుగుతుంది. వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు చేతిలోని చిన్న చిన్న నరాలు ఉత్తేజితమవుతాయి.

పూర్వకాలలో ఆహారాన్ని చేతితోనే తినేవారు అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారని చెప్తున్నారు. అంతేకాదు భోజనం కానీ,టిఫిన్ కానీ ప్లేట్స్ లో కాకుండా ఆకులలో చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. చలా మంది కుర్చీలలో కూర్చుని అన్నం తింటున్నారు అని.

అలా కాకుండా కింద కూర్చుని తినడం వలన పొట్టలోని కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది తద్వారా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది అని చెప్తున్నారు.ఇలా చేస్తే అధిక బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు.