న్యూస్ పేపర్ లలో పెట్టి ఇచ్చే ఆహారాన్ని తింటున్నారా...అయితే మీరు ప్రమాదం లో ఉన్నట్లే..తప్పక తెలుసుకోవాల్సిన విషయం...  

Eating Food In Newspaper-

మన బయటకి ఎక్కడికైనా వెళ్తే రోడ్ పక్కన ఆహారాన్ని ఇష్టంగా తింటాం. అక్కడ దొరికే ఇడ్లీ , మిర్చి , సమోసా లాంటి ఆహార పదార్థాలను తినేందుకు ఆసక్తి చూపుతాం . అయితే కొన్ని సమయాల్లో వాటిని పేపర్ లో పెట్టి మనకు సర్వ్ చేస్తారు..

న్యూస్ పేపర్ లలో పెట్టి ఇచ్చే ఆహారాన్ని తింటున్నారా...అయితే మీరు ప్రమాదం లో ఉన్నట్లే..తప్పక తెలుసుకోవాల్సిన విషయం...-Eating Food In Newspaper

మనం కూడా వాటిలోనే తినేస్తాం. అయితే అలా పేపర్ లలో తినడం వల్ల మనకి ప్రాణాంతకర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

మన దేశం లో చిన్న హోటళ్లు, తోపుడు బండ్లలలో ఆహార పదార్థాలను న్యూస్ పేపర్లలోనే చుట్టి ఇస్తున్నారు.

ఆ ఆహార పదార్థాలు ఎంత శుభ్రంగా ఉన్నా వాటిని న్యూస్ పేపర్లలో చుట్టడం వల్ల అవి నెమ్మదిగా విషతుల్యం అవతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్‌ చేయడానికే కాకుండా వంటకాల నూనెను పీల్చడానికి కూడా న్యూస్ పేపర్లను వాడుతుంటారు. తిన్నతరవాత కొంతమంది చేతులు శుభ్రపర్చుకోడానికి కూడా వీటినే వినియోగిస్తున్నారు

ఆహారపదార్థాలను న్యూస్‌పేపర్లలో చుట్టి ఇవ్వడం వల్ల వాటి తయారీకి వినియోగించే ఇంక్‌లు, డైలు ఆహార పదార్థాలకు అంటుకొనే ప్రమాదం ఉందని, వాటి కారణంగా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), ది నేషనల్ టెస్ట్ హౌజ్ (ఎన్‌టీహెచ్)లతో కలిసి రెండు సర్వేలు చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.

తమ సర్వేలో అసంఘటిత రంగంలోని హోటళ్లలోనే ఎక్కువగా న్యూస్ పేపర్లలో చుట్టి ఆహరపదార్థాలను అందిస్తున్నట్లు తేలిందని వెల్లడించింది..

న్యూస్ పేపర్ ప్రింట్ అయ్యే ఇంక్ లో ఏం ఉంటుంది.న్యూస్ పేపర్ ప్రింట్ చేసే ఇంక్ అంత సురక్షితం కాదు ఎందుకంటే న్యూస్ పేపర్ ఇంక్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే నాఫ్తలమైన్, ఆరోమటిక్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి.

హానికరమైన బెంజీడైన్, 4-ఆమైనో బైఫినైల్ రసాయనాలు కూడా ఈ ఇంక్‌లో ఉంటాయి.ప్రస్తుతం న్యూస్‌పేపర్లలో ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్ చేయడంపై నిషేధం విధిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జులై 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని పేర్కొంది.