మనలో చాలామంది కోడిగుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో పాటు గుడ్లు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు.
అయితే పరిశోధకులు గుడ్ల మీద చేసిన తాజా అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రోజూ గుడ్డు తింటే షుగర్ వచ్చే అవకాశం ఉందని అవాక్కయ్యే విషయాన్ని వెల్లడించారు.
శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రతిరోజూ గుడ్లు తినే అలవాటు ఉన్నవాళ్లను కంగారు పెడుతోంది.రోజూ గుడ్లు తినేవాళ్లు టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని.
సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే రోజూ గుడ్లు తినేవాళ్లకు 60 శాతం ఎక్కువగా డయాబెటిస్ ముప్పు పొంచి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.శాఖాహారమైన గుడ్డును ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు.
రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకే గుడ్లు దొరుకుతాయి కాబట్టి కోడిగుడ్లు తినడానికి ఆసక్తి చూపేవాళ్లు ఎక్కువ.
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 8,545 మంది చైనీయుల యొక్క బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి ఎవరైతే గుడ్లు తిన్నారో వాళ్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని.
గుడ్లు తక్కువగా తినేవాళ్లలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని తేల్చారు.అయితే ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో గుడ్లు తింటే షుగర్ రాదని కొన్ని పరిశోధనల్లో తేలింది.
కానీ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలు భిన్నంగా ఉండటంతో ఎవరి మాటలను నమ్మాలో అర్థం కావడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే రోజూ గుడ్లు తినేవాళ్లు గతంతో పోలిస్తే గుడ్ల వినియోగం తగ్గిస్తే మంచిది.శాస్త్రవేత్తల తాజా పరిశోధనలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గుడ్లపై మరిన్ని పరిశోధనలు చేస్తే మాత్రమే అసలు నిజాలు తెలుస్తాయి.