బాదం పప్పులు తింటే.. రెండు రోగాలకు చెక్‌!

రోజుల్లో చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్‌ సాధరణమైంది.ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడినవారు కొన్ని కోట్లలో ఉన్నారు.

 Eating Daily Almonds Twice Controls Diabetes And Cholesterol, Almonds, Bad Chole-TeluguStop.com

దీనికి ప్రధాన కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు, ఇతర అనేక కారణాలు.ఈ వ్యాధిని నియంత్రించేందుకు కొన్ని ఆహారపు అలవాట్లతోపాటు ఎక్సర్‌సైజ్‌లు చేయాలని డాక్టర్లు సూచిస్తారు.

అయితే, మన ఆహారంలో ప్రతిరోజూ బాదం పప్పులు తింటే కూడా షుగర్‌ వ్యాధిని నియంత్రించవచ్చు.అంతేకాదు దీనివల్ల కే వలం డయాబెటీస్‌ కాకుండా కొలెస్ట్రాల్‌కు కూడా చెక్‌ పెట్టొచ్చు.

అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగా బాదాంలతో రెండు వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రతిరోజూ రెండుపూటలా బాదం పప్పు తింటే శరీరంలో గ్లూకోజ్‌ మెటబాలిజంతోపాట పనితీరు మెరుగవుతుంది.

Telugu Almonds, Badcholesterol-Latest News - Telugu

దీంతోపాటు కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది.ప్రీ డయాబెటీస్‌తో బాధపడేవారికి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను పెంచుతుంది.దీంతో డయాబెటీస్‌ స్థాయి పెరగకుండా నియంత్రిస్తుంది.ప్రీ డయాబెటీస్‌ స్టేజ్‌ నుంచి టైప్‌–2 డయాబెటీస్‌ బారిన పడకుండా ఉండాలంటే వయస్సుతో సంబంధం లేకుండా ఎక్సర్‌సైజ్‌లు చేయాలని ఇటీవలి సర్వే తెలిపింది.

దీంతోపాటు రోజూ రెండు పూటలా బాదం పప్పులను స్నాక్‌లా తీసుకుంటే డయాబెటీస్‌ రాకుండా చెక్‌ పెట్టవచ్చు.ప్రముఖ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ మదన్‌ కూడా ఈ సర్వేలో భాగం పంచుకున్నారు.

బాదం పప్పులతో కొలెస్ట్రల్‌ లెవల్‌లోని ఎల్‌డీఎల్‌ స్థాయిని మెరుగుపడటాన్ని తెలిపారు.ఈ సర్వే ద్వారా 12 వారాల్లో మెరుగైన ఫలితం లభించిందని ఆయన అన్నారు.

ఈ సర్వేలో 275 మంది పాల్గొన్నారు.అందులో 59 మంది పురుషులు, 216 మంది స్త్రీలు ఉన్నారు.

వారంతా ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు.వీరు ప్రతిరోజూ 56 గ్రాములు పచ్చి బాదం పప్పులను తిన్నారు.

వీరికి షుగర్‌ వ్యాధి బ్యాలెన్స్‌గా ఉంది.షుగర్‌తో బాధపడేవారికి షుగర్‌ లెవల్‌ పెరగడం తగ్గింది.

దీంతోపాటు వారి శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవల్‌ కూడా మెరుగుపడుతుంది.కేవలం మూడు నెలల్లోనే మెరుగైన ఫలితాలను సాధించారు.

దీంతోపాటు యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఇటువంటి రోగాల బారిన పడకుండా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube