Curd Antioxidant : పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా..నిపుణులు ఏమి చెప్పారంటే..

ఎండాకాలంలో చల్లనీ పెరుగు ఎక్కువమంది ప్రజలు ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు.పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

 Eating Curd Is Good For Health Or Not What Experts Say , Eating Curd, Sleep Prob-TeluguStop.com

కానీ కొన్ని కాలాలలో పెరుగు తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామందిలో అపోహలు కూడా ఉన్నాయి.కానీ పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే పెరుగును ప్రతిరోజు తినకుండా ఉండలేరు.

ఇంకా చెప్పాలంటే ఆరోగ్యానికి కావాల్సిన ఉపయోగకరమైన పోషకాలు అన్ని ఇందులో ఉన్నాయి.పెరుగు తినడం వల్ల శరీరంలోని చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.

పెరుగు తినడానికి సరైన సమయం ఏంటో చాలామందికి తెలియదు.ప్రతి రోజు మధ్యాహ్నం ఒక కప్పు పెరుగు తినడం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పెరుగు ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు మధ్యాహ్నం పెరుగు తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.ఇందుకోసం మనం ప్రతిరోజు పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Telugu Antioxidant, Anxiety, Curd, Tips, Sleep Problems, Stress-Telugu Health

అదనంగా నిద్ర సమస్యలను దూరం చేసుకోవచ్చు.పెరుగులో కొవ్వు అధికంగా ఉంటుంది.కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది.దీని వల్ల దంతాలు, ఎముకలు కూడా బలంగా ఉంటాయి.పెరుగు మంచి ఎనర్జీ పోస్టర్.ఇది ఒత్తిడిని, ఆందోళన దూరం చేస్తుంది.పెరుగు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.ప్రతిరోజు పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.ఇంకా చెప్పాలంటే గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడడానికి ప్రతి రోజు పెరుగు తినడం కూడా ఎంతో మంచిది.పెరుగు తినడం వల్ల చర్మం మృదువు గా మారుతుంది.

పెరుగులో బెల్లం కలుపుకుని తినడం వల్ల ఎండాకాలంలో చలవ చేస్తుంది.ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ప్యాకెట్లలో సేల్ చేస్తున్న పెరుగును తింటున్నారు.

కానీ కొన్ని రోజుల క్రితం ప్రతి ఒక్క ఇంట్లో కూడా మట్టి కుండలో పెరుగును తయారు చేసుకునేవారు ఇలాంటి పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube