చిప్స్ తింటున్నారా...ఈ విషయాలు తెలిస్తే జన్మలో చిప్స్ తినరు  

Eating Chips Good...or Bad...? -

ప్రతి రోజు చిప్స్ తింటున్నారా? అయితే ఏరి కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.అదేపనిగా చిప్స్ తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదనిఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Eating Chips Good...or Bad...?

వారానికి ఒకసారి తింటే పర్లేదు కానీ అదే పనిగా తింటే మాత్రం హానికరం అని అంటున్నారు.అదేపనిగా నూనెలో వేగించిన స్నాక్స్‌ను తీసుకుంటే ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

నూనెలో వేగించిన ఆహారాలలో ఎటువంటి పోషకాలు ఉండవు.నూనెలో వేగించటం వలన వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి.అందువల్ల ఈ ఆహారాలకు బదులు సలాడ్స్ తింటే మంచిది.

చిప్స్ తింటున్నారా…ఈ విషయాలు తెలిస్తే జన్మలో చిప్స్ తినరు-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

చిప్స్ లో హైఫ్యాట్ కెలోరీలు ఉండుట వలన అదే పనిగా తింటూ ఉంటే అధిక బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది.

ముఖ్యంగా బంగాళాదుంప చిప్స్ ద్వారా ఈ సమస్య అధికం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిప్స్ లో సోడియం అధిక మొత్తంలో ఉండుట వలన రక్తపోటు పెరుగుతుంది.

దాంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

రోజూ బంగాళాదుంప చిప్స్ తింటూ ఉంటే హై కొలెస్ట్రాల్ తప్పదు.

డీప్- ఫ్రై చేయడం ద్వారా చిప్స్‌లో ట్రాన్స్‌ఫాట్ పెరుగుతుంది.ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

వేగించిన ఆహారాలలో ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని పెంచుతాయి.

అందువల్ల చిప్స్ కి బదులుగా ఉడికించిన ఆహారాలను తీసుకుంటే మంచిది.

గోధుమలతో చేసిన వంటకాలు, మొక్కజొన్నతో చేసిన స్నాక్స్ వంటివి లో కెలోరీలను కలిగివుంటాయి.

కూరగాయలతో చేసిన సలాడ్స్, సాండ్‌విజ్‌లు తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Eating Chips Good...or Bad...?- Related....