ఈటల పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ హెచ్చరిక.. ?

తెలంగాణ రాజకీయాల్లో గులాభి పార్టీ నేత ఈటల రాజేందర్ విషయంలో ప్రభుత్వం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారిన విషయం తెలిసిందే.ఇప్పటి వరకు అనేక మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం ఇంతలో తెగేలా లేదు.

 Eatala Rajendar Follower Giving Warning To Trs Leaders-TeluguStop.com

అదీగాక మరో ఉద్యమం మొదలైన ఆశ్చర్యపోనక్కర లేదు.

ఇప్పటికే ఈటల తన రాజకీయ భవిష్యత్తు పై ప్రణాళికలు రచిస్తుండగా, ఈ నాయకున్ని దెబ్బ కొట్టడానికి కారుగుర్తు ఓనర్ తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

 Eatala Rajendar Follower Giving Warning To Trs Leaders-ఈటల పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ హెచ్చరిక.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఈటల అనుచరుడు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ రవీందర్ గులాభి నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఈటల రాజేందర్ వెంట ఉండి పదవులు తెచ్చుకున్న వాళ్లు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడు బొంగురం లేని నాయకులను చేరదీసి పదవులు వచ్చేలా చేస్తే ఇప్పుడు రివర్స్‌లో మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.ఇప్పటికైన నోరు అదుపులో పెట్టుకోవాలని, ఈటలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ రవీందర్ హెచ్చరించారట.

#TRS Leaders #Jammikunta #Eatala Rajender #Ravinder #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు