భుజాల్లో చేరిన కొవ్వును వదిలించుకునేందుకు ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండండి!

బరువు పెరగడం వల్ల మనం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.ఊబకాయం సమస్యల్లో భుజాలలో కొవ్వు చేరడం అనేది కూడా ఒకటి.

 Eat These Foods To Remove The Fat Of The Arms Details, Arms Fat, Reduce Arms Fat-TeluguStop.com

ఇటీవలికాలంటో ఊబకాయం ఒక సాధారణ సమస్యగా మారింది.దీనిలో భాగంగా భుజాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు మహిళల దుస్తులు ధరించడానికి ఇబ్బందులు పడుతుంటారు.

కొవ్వు అనేది భుజాల్లో పేరుకుపోవడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయి.ఎవరైనా సరే వారు బరువు పెరగడానికి కారణం వారు తీసుకునే ఆహారంలోనే ఉంటుంది.

మనిషి బరువు పెరగడానికి, భుజాల్లో కొవ్వు చేరడానికి కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.భుజాల్లో కొవ్వు కరిగేందుకు ఈ మార్గాలను అనుసరించండి.

స్వీట్స్‌కి దూరంగా ఉండండి:

మీరు తీపిని అమితంగా ఇష్టపడితే.చక్కెర వినియోగం మన శరీరానికి హాని కలిగిస్తుందని గ్రహించి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి.

మనిషి శరీరంలో ఇన్సులిన్‌లో ఏర్పడే అసమతుల్యత మధుమేహానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది.ఫలితంగా శరీర బరువు పెరగడం ప్రారంభమవుతుంది.

బరువు పెరగడం వల్ల కలిగే ప్రభావం మన భుజాలు, పొట్టపై పడి శరీర బరువు పూర్తిగా మన నియంత్రణ తప్పుతుంది.

మైదాకు దూరంగా.వాటికి దగ్గరగా.

మైదాతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయం సమస్య తలెత్తుతుంది.శుద్ధి చేసిన కొన్ని ఆహారాలు మన శరీర భాగాలలో కొవ్వు నింపడానికి కారణంగా మారుతాయి, మిల్లెట్, మొక్కజొన్న, బార్లీ మొదలైన వాటిని ఆహారంలో చేర్చవచ్చు.ఇది ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం అని గుర్తించండి.

ఈ ఆహారాన్ని తప్పకుండా తినండి:

మన రోజువారీ ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, పండ్లను చేర్చుకోవడం మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.దీనితో పాటు ఇటువంటి ఆహారం మన శరీరంలోని కొవ్వును తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.సుగంధ ద్రవ్యాలలో ఒకటైన పసుపు మనశరీర బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.పసుపును వినియోగించడం ద్వారా చేతుల్లో కొవ్వు చేరడం నుంచి నుండి విముక్తి పొందవచ్చు.చేతులకు పసుపుతో మసాజ్ చేయడం వల్ల అక్కడున్న అనవసర కొవ్వు కరిగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది.ఇందుకోసం ఆవనూనె, నువ్వుల నూనెతో పసుపు మిశ్రమాన్ని తయారు చేసి, దానిని భుజాలకు మసాజ్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube