రక్తనాళాలు శుభ్రంగా ఉండాలంటే....ఇవి తప్పనిసరి  

  • ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గుండెకు సంబందించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ గుండె సమస్యలు రక్తంలో కొవ్వు పేరుకుపోవడం వలన ఏర్పడుతున్నాయి. రక్తంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకుంటే గుండె సమస్యల నుండి బయట పడవచ్చు. ప్రతి రోజు వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటే కొవ్వు బారి నుండి బయట పడవచ్చు. అలాగే కొన్ని ఆహారాలను తీసుకోవటం వలన రక్తంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుస్కుందాం.

  • పాలకూరలో ఫైబర్‌, ఫోలేట్‌, పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించి రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతుంది.

  • Eat These Foods To Cleanse Your Arteries-

    Eat These Foods To Cleanse Your Arteries

  • పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన రక్తనాళాలను వెడల్పు చేయటమే కాకుండా రక్తనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. పసుపులో ఉండే విటమిన్‌ బి6 రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

  • ఆలివ్ ఆయిల్ లో మోనో అన్‌శాచురేటెడ్‌ ఓలియిక్‌ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో అడ్డంకులు లేకుండా చేస్తాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

  • అవకాడోల్లో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను కరిగిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌)ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.