ఆ పండు తింటే ఆ ఆరోగ్య సమస్య దగ్గరికి కూడా రాదు!

సాధారణంగా పండ్లలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసినదే.కానీ పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేము.

 Eating That Fruit Doesn’t Even Come Close To That Health Problem!, Figs,dry F-TeluguStop.com

కానీ అంజీర పండ్లలో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి.ఈ పండ్లు ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

తినడానికి కొంచెం పులుపుగా, వగరుగా అనిపించిన ఇందులో పోషక పదార్థాలు మెండుగా లభిస్తాయి.మన శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి మెరుగుపడాలన్నా ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ రెండు అంజీర పండ్లను కచ్చితంగా తినాల్సిందే.ప్రతిరోజు అంజీర పండ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ.తెలుసుకుందాం…

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అంజీరా పండ్లను డ్రైఫ్రూట్స్ రూపంలోనే ఎక్కువగా వాడుతున్నారు.ఇలా డ్రైఫ్రూట్స్ రూపంలో లభ్యం కావడం వల్ల వీటిని కొద్ది రోజుల పాటు నిల్వ ఉంచుకొని తినొచ్చు, అంతేకాకుండా దూర ప్రయాణాలకు కూడా వీటిని తీసుకొని వెళ్లొచ్చు.ఈ పండ్లలో ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం వంటి పోషక విలువలు మెండుగా ఉన్నాయి.

నిత్యం అంజీర పండ్లను భోజనానికి ముందు రెండు పండ్లను తిన్నట్లయితే మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం అధికంగా పెరుగుతుంది.రక్తంలోఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడతారు.

అందువల్ల డాక్టర్లు అంజీర పండ్లను తినమని సూచిస్తారు.వీటిలో మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తంలోని రక్త కణాల సంఖ్యను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

గర్భిణి స్త్రీలు ఈ పండ్లను ప్రతిరోజూ తినడం ద్వారా హిమోగ్లోబిన్ శాతం పెరిగి,బిడ్డ పెరుగుదలకు దోహదపడుతాయి.

పీచు పదార్థం అధికంగా కలిగి ఉండటం ద్వారా శరీరంలో జీవక్రియ రేటును మెరుగు పరచడంతో పాటు మన ప్రేగులలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పీచు పదార్థాల లో పెక్టిన్ అనే పదార్థం ఉండటం ద్వారా మన శరీరంలో ఏర్పడ్డ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.ఎదుగుతున్న పిల్లలకు ప్రతి రోజు వారి ఆహారంలో ఈ పండ్లనుఉంచడం ద్వారా వారి శరీర బరువు పెరగడంతోపాటు, తెలివితేటలు పెరుగుతాయి.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు రెండు అంజీర పండ్లను తీసుకొని ఒక గ్లాసుపాలు తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొంది హాయిగా నిద్రపోతారు.ఇంతటి పోషక విలువలు కలిగిన పండ్లను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube