క‌రోనా టైమ్‌లో పన్నీర్ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా?

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి టెర్ర‌ర్ సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే.చైనాలో పుట్టుకొచ్చిన ఈ క‌రోనా అతిసూక్ష్మ‌జీవి అయిన‌ప్ప‌టికీ.

 Eat Paneer During Coronavirus Immunity Power Vitamin D-TeluguStop.com

ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను పొట్ట‌న‌పెట్టుకుంది.వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.

ఈ ప్రాణాంత‌క వైర‌స్ అదుపులోకి రావ‌డం లేదు.ఈ నేప‌థ్యంలోనే క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచే ఆహారం తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

 Eat Paneer During Coronavirus Immunity Power Vitamin D-క‌రోనా టైమ్‌లో పన్నీర్ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇమ్యూనిటీ పెంచే ఆహారంలో ప‌న్నీర్ కూడా ఒక‌టి.

ప్ర‌తిరోజు మోతాదు మించ‌కుండా ప‌న్నీర్ తీసుకోవ‌డం వ‌ల్ల‌.

అందులో ఉండే పోష‌కాలు భ‌యంక‌ర వైర‌స్‌ల‌తో పోరాడే రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌రుస్తుంది.రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డ‌మే కాదు.

ప‌న్నీర్‌తో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయ‌డంలో ప‌న్నీర్ అద్భుతంగా ప‌నిచేస్తుంది.

మధుమేహం రాకుండా నిరోధిస్తుంది.

అలాగే పన్నీర్‌లో ఉండే కాల్షియం ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది.ఇక పన్నీర్‌ తింటే చాలా మంది బ‌రువు పెరుగుతార‌ని న‌మ్ముతుంటారు.కానీ, పన్నీర్ లో ఉండే అధిక ప్రొటీన్ ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది.

త‌ద్వారా బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.పన్నీరులో ఫాస్ఫరస్, ఫాస్ఫేట్‌లు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

అదేవిధంగా, సూర్యర‌శ్మి నుంచి వ‌చ్చే విట‌మిన్ డి కూడా ప‌న్నీర్ ద్వారా పొందొచ్చు.అలాగే పన్నీర్ మెగ్నీషియంతో నిండి ఉంది.

ఇది గుండె జ‌బ్బుల‌ను నివారించి.గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

ఇక ప్ర‌తిరోజు మోతాదు మించికుండా ప‌న్నీర్ తీసుకుంటే.వృద్ధాప్యం వల్ల‌ వయస్సు మీరుతున్నప్పుడు వచ్చే కణజాల హీనత నుంచి ర‌క్షిస్తుంది.

#COVID-19 #Health Tips #Coronavirus #Paneer #Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు