చికెన్ తినమని చెప్పగానే కోమా నుంచి లేచిన వ్యక్తి!

నాన్ వెజ్ లలో చికెన్ కి ఉండే డిమాండ్ మరే ఇతర దానికి ఉండదు.చికెన్ ఈ పేరు వినగానే కొంతమందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.

 Man Woke Up, From A Coma, Eat Chicken,mentally Healthy,brother,favorite Food,-TeluguStop.com

చికెన్ వండిన వాసన పీల్చగానే ఇక లొట్టలేస్తూ తినాలనిపిస్తుంది.సాధారణంగా చికెన్ ను ఎన్నో రకాల వెరైటీస్ తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటారు.

చికెన్ వాసన వస్తే ఆకలి లేని వారికి సైతం తినాలనిపిస్తుంది.ఈ తరహాలోనే చికెన్ అంటే ఎంతో ఇష్టం ఉన్న ఒక వ్యక్తి ఏకంగా చికెన్ పేరు వినగానే కోమాలో నుంచి బయట పడిన ఘటన తైవాన్ లో చోటుచేసుకుంది.

తైవాన్ కి చెందిన చియు అనే టీనేజ్ కుర్రాడు కొద్ది రోజుల క్రితం బైక్ డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి కింద పడ్డాడు.బైక్ యాక్సిడెంట్ అవడంతో చియుకి బలమైన గాయాలతో, అధిక రక్తస్రావంతో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించారు.

అతన్ని పరీక్షించిన వైద్యులు బ్రతకడం కష్టమని తేల్చారు.దాదాపుగా ఆరు సర్జరీలు చేశారు.

అయినా కూడా చియులో ఏమాత్రం కదలికలు లేకుండా కేవలం మంచానికి మాత్రమే పరిమితం అయ్యాడు.

డాక్టర్లు ఆపరేషన్లు అయితే చేశారు గాని, ఎప్పుడు ఎలా లేస్తాడో చెప్పలేమని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఎక్కడో ఆశతో తన కొడుకు బ్రతుకుతాడు అనే నమ్మకం ఉంచి, నిత్యం పరీక్షలు చేయిస్తున్నారు.

ఇలా వారం, పదిరోజులు, నెల, రెండు నెలలు గడిచి పోయినప్పటికీ అతనిలో ఏమాత్రం మెళుకువలు లేకుండా అలాగే ఉండిపోయాడు.జీవచ్ఛవంలా పడి ఉన్న తన కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతగానో కన్నీరుమున్నీరు అయిపోయారు.

చివరి ప్రయత్నంగా చియు అన్న ఆస్పత్రికి వచ్చి అతని దగ్గరికి వెళ్లి”తమ్ముడు.నీ కోసం నేను చికెన్ ఫిల్లెట్ తీసుకు వచ్చాను.

నువ్వు లేవకుంటే నీది కూడా నేనే తినేస్తానని” అతని చెవిలో చెప్పాడు.అలా చెప్పిన తర్వాత అక్కడ జరిగిన అద్భుతం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అప్పటివరకు ఏమాత్రం కదలిక లేకుండా ఉన్న అతని శరీరంలో కొద్దికొద్దిగా కదిలికలు ఏర్పడడంతో అందరిలోనూ అతనిపై ఆశలు పెరిగాయి.చికెన్ అనే పేరు వినగానే మెల్లగా అతని తమ్ముడు లేసి కూర్చోవడంతో అక్కడున్న వారందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.

చికెన్ అంటే తన తమ్ముడికి ఎంతో ఇష్టం అని గ్రహించిన అన్నయ్య చివరి ప్రయత్నంగా ఇలా చేయడంతో తన ఆరోగ్యం కుదుటపడింది.అంతేకాకుండా ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు.

తనకు బాగు చేసినందుకు ఆసుపత్రి సిబ్బందితో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తమకు ఇష్టమైన ఆహారం చేసి పెడితే కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఈ ఈ సంఘటన ద్వారా నిరూపితమైనది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube