అరటిపండు తినండి .. ఈ రోగాలకు దూరంగా ఉండండి  

Eat Banana Regularly And Stay Away From These Diseases-

* అరటిపండు లో ఫైబర్ అధికపాళ్ళలో ఉంటుంది. కడుపు ఎప్పుడు శుభ్రంగా ఉండాలంటే, తిన్న తిండి బాగా అరిగి, మలంలో మొత్తం పోవాలంటే ఫైబర్ చాలా అవసరం. అరటిపండు ఈ ఫైబర్ ని ఇస్తుంది..

అరటిపండు తినండి .. ఈ రోగాలకు దూరంగా ఉండండి -

అంటే, మలబద్దకం లాంటి సమస్యలను, అజీర్ణం లాంటి ప్రాబ్లంను అరటిపండు నిలువరిస్తుంది అన్నమాట. * అరటిలో కాల్షియం శాతం కూడా ఎక్కువ. మీ ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం.

లేటు వయసులో ఉన్నవారు అరటి తింటే కాల్షియం లాభలను పొందవచ్చు.* పచ్చిగా ఉండే అరటి డయాబెటిస్ పషెంట్లకు కూడా మంచివని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే షుగర్ వ్యాధీ పెద్ద స్టేజిలో ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించండి.

* ఆకలిని సులువుగా తీరుస్తుంది అరటి. ఎందుకంటే దీంట్ల కాలరీలు ఎక్కువ. 90-120 కాలరీలు లభిస్తాయి సైజుని బట్టి. ఓ అయిదు అరటిపండ్లు తీసుకుంటే ఓ పూటకి కావాల్సిన కాలరీలు దొరికేసినట్టే‌.

* బరువు తగ్గాలనుకునే వారు కూడా అరటి తింటే మంచిది. ఎలాగో అవసరమైన ఫైబర్ దొరుకుతుంది. కావాల్సిన దొరుకుతాయి, ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు.

* అరటిలో పొటాషియం ఎక్కువ. ఇది సోడియం ఎక్కువైతే కంట్రోల్ చేసి, బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. పొటాషియం మజిల్ రిలాక్సేషన్ కూడా ఉపయోగపడుతుంది.

కాబట్టి, నిద్రలేమి లాంటి సమస్యలు రావు.* అల్సర్స్ లాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే అరటి రెగ్యులర్ గా తినాల్సిందే. అలాగే ఛాతిలో మంట లాంటి సమస్య ఉన్నవారు కూడా అరటి మీద ఆధారపడవచ్చు.

అరటి శరీరంలోని pH లెవల్స్ ని బ్యాలెన్స్ చేసి ఈ సమస్యలను దూరం చేస్తుంది.* అరటి ఎక్కువగా తినడం వలన క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా పడిపోతాయని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు. అరటి శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచుతుంది.

అలా రోగనిరోధక శక్తి పెరగటం వలన క్యాన్సర్ కణాలు సులువుగా పెరగలేవు.