బరువు తగ్గడానికి సులువైన మార్గాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో భోజన ప్రియులుకి బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది.మారుతున్న కాలం కొద్దీ వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు.

 Easy Weight Loss Tips,weight Loss Tips, Health Benefits, Green Tea, Fruits, Vegetables, Protein Food, Healthy Diet-TeluguStop.com

పౌష్టికాహారం తీసుకోవడం మానేసి, ఫాస్ట్ ఫుడ్ లకు అలవాటు పడటం వల్ల చిన్న, పెద్ద అని తేడా లేకుండా బరువు పెరుగుతున్నారు.అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సులువైన మార్గాలను ఇక్కడ చదివి తెలుసుకుందాం.

బరువు తగ్గడం విషయానికొస్తే ప్రోటీనులు పోషకాల రాజు.మీరు ఎక్కువగా ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణమయ్యేటప్పుడు అవి మీ శరీరంలోని కేలరీలను కాల్చేస్తుంది.కాబట్టి అధిక ప్రోటీనులు కలిగిన ఆహారం రోజుకు 800 నుంచి 100 కేలరీల వరకు జీవక్రియను పెంచుతుంది.

 Easy Weight Loss Tips,weight Loss Tips, Health Benefits, Green Tea, Fruits, Vegetables, Protein Food, Healthy Diet-బరువు తగ్గడానికి సులువైన మార్గాలు ఇవే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గ్రీన్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన సహజ పానీయం.గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ రేటు పెంచుతూ మనలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి.అంతేకాకుండా బరువును తగ్గించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి.వీటిలో అనేక పోషకాలు, ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండి, తక్కువ శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి.

ఎక్కువగా పండ్లు కూరగాయలు తినేవారు బరువు తక్కువగా ఉన్నారని పలు అధ్యయనాల్లో నిరూపించబడింది.

ఎక్కువ నీటిని తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు.అర లీటర్ నీటిని తాగిన తర్వాత ఒక గంటకు 24 – 30% వరకు క్యాలరీలను బర్న చేస్తుంది.భోజనానికి ముందు నీటిని తాగడం వల్ల కేలరీలు తగ్గుతాయి.

వీటితో పాటు ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube