మొబైల్ స్లో అవుతోందా? ఇవిగో తక్షణ పరిష్కార మార్గాలు  

Easy Ways To Treat Your Slow Running Mobile-

మార్కేట్లో 3GB RAM ఫోన్లు చాలానే వచ్చేసాయి. ర్యామ్ పెరిగినట్లే కాని ర్యామ్ తో పాటు జనాల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఆకర్షిణీయమైన యాప్స్ వస్తున్నాయి, దాంతో మొబైల్ లో యాప్స్ పెరుగుతున్నాయి. ఫోన్ స్లోగా పనిచేయడానికి ఇది కూడా ఓ కారణం..

మొబైల్ స్లో అవుతోందా? ఇవిగో తక్షణ పరిష్కార మార్గాలు-

కాని ఇదొక్కటే కారణం కాదు. ఇంకా ఉన్నాయి. ఆ కారణాలేంటో, ఫోన్ తిరిగి వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

* అన్నిటికన్నా ముందు సమస్య ఏమిటో తెలుసుకోవాలి. దానికోసం Trepn Profiler వాడండి. ఇది మీ మొబైల్ Central Processing System (CPU) మీద పడుతన్న భారం గురించి పూర్తి వివరాలు అందిస్తుంది.

CPU మీద RAM మీద ఒత్తిడి ఎలా పెరుగుతోంది? ఏ కారణంతో పెరుగుతుందో Trepn Profiler చాలా వివరంగా చూపిస్తుంది. సమస్య తెలిసాక పరిష్కారం తెలుసుకోవడం ఎంతసేపు!* మొబైల్ విడ్జెట్స్ స్క్రీన్ మీద బాగానే ఉంటాయి కాని CPU మీద, RAM మీద ఒత్తిడి పెంచుతాయి. మీ ఫోన్ ని ఎలాగో 99% మీరే చూసుకుంటారు. కాబట్టి అనవసరపు హంగు ఆర్భాటాలు ఎందుకు, ఆకర్షణీయమైన widgets ఎందుకు.

ముఖ్యంగా థర్ట్ పార్టీ విడ్జెట్స్ జోలికి వెళ్ళొద్దు.* Launchers ని వాడొద్దు. స్టోర్ లో ఎన్నో లాంచర్స్ మీ మెమోరి స్పేస్ ని తినేయడమే కాకుండా, ఇన్బిల్ట్ యానిమేషన్స్, వాల్ పేపర్సద తో లేని ఒత్తిడి పెంచుతాయి.

మొబైల్ తో వచ్చిన UI కన్నా స్పీడ్ గా, స్మూత్ గా ఏ లాంచర్ పనిచేయదు. కాబట్టి మొబైల్ లో ఉన్న డీఫాల్ట్ UI నే వాడండి. ఇంకేది వద్దు.

* మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇదో బెస్ట్ మార్గం. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయగానే క్యాచి ఫైల్స్ చాలావరకు డిలిట్ అయిపోతాయి.

ప్రాబ్లమ్ మరీ సీవియర్ గా ఉంటే మాత్రం రిస్టోర్ ఫ్యాక్టరీ సెటింగ్స్ నొక్కయటమే.* క్యాచీ ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం, స్టోరేజి స్పేస్ తగ్గించుకోవడం, అనవసరపు యాప్స్ డిలీట్ చేయడం, సిస్టమ్ ఆనిమేషన్స్ తీసేయటం, బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయడం, ఒకే బ్రౌజర్ వాడటం . ఇవి ఎలాగో మీకు తెలిసిన సలహాలే.