వాట్సాప్‌ లో ప్రైవసీని కాపాడుకోవడానికి సులువైన మార్గాలు..

సైబర్ దాడులు రాజ్యమేలుతున్న తరుణంలో వివిధ రకాల యాప్స్ మరింత పటిష్టంగా తయారౌతున్నాయి.తమ యూజర్లకు వీలైనంత వరకు.

 Easy Ways To Protect Whatsapp Messages, Whatsapp Messages, Priacy Options, Finge-TeluguStop.com

రక్షణ చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.యాప్స్ తాలూక సెట్టింగులను చాలా వరకు ఛేంజ్ చేసి, మరింత స్ట్రాంగ్ కోడింగ్ బేకెండ్లో రాస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన మెసేజింగ్ యాప్ వుంది అంటే.అది వాట్సాప్ మాత్రమే.

ఇప్పుడు వాట్సాప్ మీ డేటా భద్రతల కోసం 7 సులువైన మార్గాలను మీకు సూచిస్తుంది.అవేమిటో చూద్దాం.

మామూలుగా.‘స్టేటస్’ అనేది మన కాంటాక్ట్స్ లో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది.ఇక్కడ సెట్టింగ్స్ లో స్టేటస్ ప్రైవసీని మార్చడం ద్వారా మన వాట్సాప్ స్టేటస్ కేవలం మనం ఎంచుకున్న వారికి మాత్రమే కనిపించేలా చేయవచ్చు.వాట్సాప్ లో ఉన్న సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మనల్ని గ్రూపులో ఎవరు యాడ్ చేయాలో మనమే డిసైడ్ చేయవచ్చు.

‘లాస్ట్ సీన్’.అంటే మనం వాట్సాప్ ను చివరిసారిగా ఎప్పుడు చూసామో కూడా తెలిసిపోతుందన్న మాట.అయితే సెట్టింగ్స్ ద్వారా దీన్ని కూడా మార్చి మేనేజ్ చేయవచ్చు.మన ప్రొఫైల్ పిక్చర్ ఎవరికీ కనబడకూడదు అనుకుంటే, ప్రైవసీ సెట్టింగ్స్ ని మార్చుకోవడం ద్వారా దీన్ని సెట్ చేయవచ్చు.

Telugu Block, Cyber Crimes, Waysprotect, Lock, Messages, Priacy, Unlock, Whatsap

అబౌట్ సెక్షన్ మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్లకి మాత్రమే కనిపించాలా…? లేదా అందరికీ కనిపించాలా…? లేకపోతే ఎవరికీ కనిపించకుండా ఉండాలా అనేది కూడా ఆప్షన్ ద్వారా మనం ఎంచుకోవచ్చు.ఈ మధ్యే అందుబాటులోకి వచ్చింది ఫింగర్ ప్రింట్ లాక్. దీని ద్వారా మన ఫోన్ కు ఉపయోగించే బయో మెట్రిక్ లాక్ ను వాట్సాప్ కు కూడా ఉపయోగించవచ్చు.దానితో పాటు ఈ లాక్ కు సంబంధించిన టైమర్ ఆప్షన్ ద్వారా మనం ఫోన్ ఉపయోగించినంత సేపు కూడా వాట్సాప్ లాక్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు.

ఇక దాదాపుగా ఈ ఫీచర్ అందరికీ తెలిసే ఉంటుంది.వాట్సాప్ లో ఎవరైనా విసిగిస్తే వారిని బ్లాక్ చేయడం ద్వారా ఆ నంబర్ నుంచి మీకు కాల్స్ కానీ, మెసేజెస్ కానీ రాకుండా చేయవచ్చును.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube