దేశంలో జరగబోయే ఉప ఎన్నికల విషయంలో ఈసీ కీలక నిర్ణయం..!!

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలో చాలా రాజకీయ పార్టీల నేతలు.

 Election Commission Key Decision Regarding By Elections To Be Held In The Country-TeluguStop.com

ర్యాలీలు నిర్వహించడంతో పాటు భారీగా ప్రచార సభలు ఏర్పాటు చేయడం జరిగింది.అయితే ప్రస్తుతం దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తమిళనాడు హైకోర్టు కరోనా సెకండ్ వేవ్ ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ పై కీలక కామెంట్ చేయడం జరిగింది.

ఈసీ పై హత్యాభియోగం కేసులు ఎందుకు నమోదు చేయకూడదు అంటూ వ్యాఖ్యానించింది.

 Election Commission Key Decision Regarding By Elections To Be Held In The Country-దేశంలో జరగబోయే ఉప ఎన్నికల విషయంలో ఈసీ కీలక నిర్ణయం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో తమిళనాడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఈసీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ని ఆశ్రయించడం జరిగింది.

ఇదిలా ఉంటే.దేశంలో మిగతా చోట్ల అసెంబ్లీ మరియు పార్లమెంటు జరగాల్సిన ఉప ఎన్నికలపై తాజాగా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసినట్లు ఈసీ ప్రకటించింది.ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

దేశంలో పరిస్థితులు అంతా మెరుగుపడిన తర్వాతే ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే పరిస్థితులను సమీక్షించి తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

#Key Decision #COVID-19 #Suprem Court #TamilnaduHigh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు