కడుపులో మంటను ఈ చిట్కాలతో తరిమికొట్టండి  

Easy And Effective Home Remedies For Gastritis-

English Summary:Eat a half-day, and another at tinakapoteno properly, cigarettes, overeating, springing shoot, atimadyapanam, road side food habits, uncleanliness ..This is inflammation of the stomach to various reasons. Mantaga has already said that once again, the same habits, commonly koniteccukuntam pregnant again.This happens frequently comes ulcer, stomach cancer comes when approaching misfortune.

But how to escape from this danger? Very simple.Stop the habits of the above. By the time the food, smoke takapovadam, excessive taking of alcohol, edipadite not eat it.. It is the case.Well, once in the stomach layatappesariki flame arose, and should appudem? There are also a few tips, cadiveyandi.

* Drink cool water, including little sugar.If at a time of low flame, once again goes drink. It is too easy to tip.

* Ginger is an effective tool to treat inflammation of the stomach. Better to take a small piece of ginger, chewing, drink some water.Maragabetti, or water, or kill, something to drink and fry ginger paripovalsinde inflammation of the stomach.

* Works with drinking chamomile tea.

ఓ పూట తిని, మరో పూట సరిగా తినకపోతేనో, సిగరెట్లు అతిగా కాల్చడం వల్లనో, అతిమద్యపానం, రోడ్ సైడ్ ఆహార అలవాట్లు, అశుభ్రత . ఇలా రకరకాల కారణాలున్నాయి కడుపులో మంట రావడానికి ..

కడుపులో మంటను ఈ చిట్కాలతో తరిమికొట్టండి -

ఎప్పుడో ఓసారి మంటగా ఉంటోంది కదా అని మళ్ళీ అవే అలవాట్లతో మళ్ళీ కడుపులో మంటని కొనితెచ్చుకుంటాం . ఇలా మాటిమాటికి జరిగితే అల్సర్ వస్తుంది, దురదృష్టం దగ్గరైతే కడుపులో క్యాన్సర్ కూడా వస్తుంది. మరి ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి ? చాలా సింపుల్ .

పైన చెప్పిన అలవాట్లన్నీ మానుకోవాలి . సమయానికి తిండి, పొగ తాకపోవడం , మద్యాన్ని అతిగా తీసుకోకపోవడం, ఏదిపడితే అది తినకపోవడం . ఇలాంటివి అన్నమాట . సరే ఓసారి లయతప్పేసరికి కడుపులో మంట పుట్టుకొచ్చింది , మరి అప్పుడేం చేయాలి ? దానికి కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి, చదివేయండి . * చల్లని నీళ్ళలో కాస్తంత పంచదార కలుపుకొని తాగండి .

ఒక్కసారికి మంట తక్కువ కాకపొతే, మరోసారి తాగండి పర్లేదు . అతి సులువైన చిట్కా ఇది. * అల్లం కడుపులో మంట పోగొట్టడానికి ఒక సమర్థవంతమైన సాధనం.

చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా నమిలి, కొన్ని నీళ్ళు తాగండి . లేదంటే నీళ్ళని లేదా పాలని మరగబెట్టి, దాంట్లో అల్లం వేసి తాగినా కడుపు మంట పారిపోవాల్సిందే . * చమోమిలే టీ తాగడం కూడా పనిచేస్తుంది.

కడుపుమంటకి ఇది మంచి ఉపశమనం . * బొప్పాయి కూడా కడుపుమంట తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది . * చివరగా చెబుతున్నా, అత్యధ్బుతమైన చిట్కా ఇది.

కొబ్బరి నీళ్ళు చేయని మేలు ఏముంటుంది ! కడుపులో మంట ఉన్నప్పుడు మాత్రమే కాదు, రోజూ కొబ్బరినీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి .