విడ్డూరం: తప్పు చేయకున్నా19 ఏళ్లు శిక్ష అనుభవించినందుకు కోర్టు అతడికి ఏం ఇచ్చిందో తెలుసా?  

$7 Million Awarded For 19 Years Of Wrongful Imprisonment To Australian - Telugu 19 Years Of Wrongful Imprisonment, Telugu Viral News Updates, Viral In Social Media, Wrongful Imprisonment To Australian

మన ఇండియన్‌ చట్టాల ప్రకారం వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కాని ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు.నిర్దోషికి శిక్ష వేస్తే న్యాయ వ్యవస్థ విఫలం అయినట్లుగా న్యాయమూర్తులు భావిస్తూ ఉంటారు.

$7 Million Awarded For 19 Years Of Wrongful Imprisonment To Australian

అందుకే ఒక్కో కేసును చాలా కాలం పాటు కొనసాగిస్తూ ఉంటారు.అలా ఏళ్లకు ఏళ్లు కొనసాగించడం వెనుక కారణం ఇదే.హడావుడిగా విచారణ చేస్తే నిర్దోషులకు శిక్ష పడే అవకాశాలు ఎక్కువ.ఆస్ట్రేలియాలో హడావుడి విచారణ కారణంగా ఒక వ్యక్తి 19 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్‌ ఈస్ట్‌మెన్‌ అనే ఒక వ్యక్తి 1989లో ఒక హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్‌ అయ్యాడు.చనిపోయిన వ్యక్తి ఒక పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వడంతో కేసు చాలా స్పీడ్‌గా విచారణ జరిగింది.

విడ్డూరం: తప్పు చేయకున్నా19 ఏళ్లు శిక్ష అనుభవించినందుకు కోర్టు అతడికి ఏం ఇచ్చిందో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

పోలీసు ఆఫీసర్‌ను చంపిన కారణంగా డేవిడ్‌ ఈస్ట్‌మెన్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లుగా ప్రకటించింది.అతడి శిక్షను పూర్తి చేసుకుని 2004వ సంవత్సరంలో విడుదల అయ్యాడు.

అప్పటి నుండి తన న్యాయ పోరాటం మొదలు పెట్టాడు.
చేయని నేరానికి నేను 19 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను.

ఆ సమయంలో నాకు కుటుంబమే లేకుండా అయ్యింది.నా తల్లి మరియు సోదరుడు మృతి చెందడటంతో పాటు నా అనుకున్న వారు అంతా నాకు దూరం అయ్యారు.

అదే సమయంలో జైలులో ఖైదీలు నాపై దాడి చేసి ఒక కన్ను పోయేలా చేశారు.ఇలా చేయని తప్పు కారణంగా నా జీవితం నాశనం అయ్యింది.

ఎన్నో ఆశలతో జీవితాన్ని గడపాలనుకున్న నేను పూర్తిగా కోల్పోయాను.అది కూడా ఒక చేయని తప్పుకు శిక్ష అనుభవించడం వల్ల అంటూ డేవిడ్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాడు.

 2004 సంవత్సరం నుండి డేవిడ్‌ కోర్టులో పోరాడుతూనే ఉన్నాడు.తనకు న్యాయం చేయాలని అతడు చేస్తున్న పోరాటానికి ఎట్టకేలకు కోర్టు నుండి తుది తీర్పు వచ్చింది.హంతకుడిగా నిర్ణయించి వెంటనే శిక్ష వేసిన కోర్టు డేవిడ్‌ వాదనలు వినేందుకు మాత్రం చాలా ఏళ్లు తీసుకుంది.ఎట్టకేలకు డేవిడ్‌ను నిర్ధోషిగా ప్రకటిస్తూ అతడికి 7 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారంను చెల్లించాల్సిందిగా ప్రభుత్వ న్యాయ వ్యవస్థను ఆదేశించింది.

చేయని తప్పుకు అతడిని శిక్ష అనుభవించేలా చేసిన వారు అతడికి క్షమాపణ చెప్పాలని కూడా కోర్టు ఆదేశించింది.
జీవితంలో అంతా కోల్పోయిన ఆ వ్యక్తి బతకడం కోసం మరియు తన నిర్దోశిత్యంను నిరూపించుకునేందుకు చేసిన కృషి ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యింది.

అతడిని ఒక గొప్ప వ్యక్తిగా అంతా భావిస్తున్నారు.అతడి విషయంలో జరిగిన అన్యాయం మరెవ్వరి విషయంలో కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆస్ట్రేలియా న్యాయ వ్యవస్థమీద ఉందని అంతర్జాతీయ సమాజం అంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు