అల్లుడిని చంపిన మామ.. ఎందుకంటే !  

east godavari, uncle, murder, son in law , East godavari Uncle Murdered Son in law - Telugu East Godavari, Murder, Son-in-law, Uncle

సొంత అల్లుడినే చంపేశాడు ఓ వ్యక్తి.తన మనమరాళ్లను చంపుతానని బెదిరించడంతో కత్తితో తల నరికేశాడు.

TeluguStop.com - East Godavari Uncle Murdered Son In Law

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

TeluguStop.com - అల్లుడిని చంపిన మామ.. ఎందుకంటే -Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image

డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.అన్నవరం జిల్లా రౌతులపూడి మండలం జగన్నాథపురానికి చెందిన సత్యనారాయణ 2015 సంవత్సరంలో శంఖవరం మండలం అచ్చంపేటకు చెందిన లచ్చబాబుతో సత్యనారాయణ తన కూమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు.

ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.గతేడాది సత్యనారాయణ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అప్పటినుంచి సత్యనారాయణకు తన అల్లుడే తన కూతురి చంపేశాడని అనుమానం ఉండేది.కుమార్తె మరణించడంతో సత్యనారాయణ తన మనుమరాళ్లను ఇంటికి తీసుకొచ్చాడు.

పండుగ కావడంలో ఆదివారం సత్యనారాయణ తన అల్లుడు లచ్చబాబుకు ఫోన్ చేసి బట్టలు పెట్టాలని, ఇంటికి రమ్మని చెప్పాడు.ఇంటికి వచ్చిన అల్లుడితో పిల్లలను ఇంటికి తీసుకెళ్లమని అడిగాడు.

అప్పుడు లచ్చబాబు నాకు రెండో పెళ్లి చేస్తేనే పిల్లలను తీసుకెళ్తానని చెప్పడంతో వారిద్దరి మధ్య గొడవ నెలకొంది.పెళ్లి చేయకపోతే పిల్లలిద్దరిని చంపేస్తానని బెదిరించాడు లచ్చబాబు.దీంతో కూతురుని పొగొట్టుకున్న కోపంలో.పిల్లలిద్దరిని చంపేస్తానని బెదిరించడంతో కోపోధ్రిక్తుడైన సత్యనారాయణ పక్కనే ఉన్న కత్తి తీసుకుని అల్లుడు లచ్చబాబు తల నరికేశాడు.

అక్కడి నుంచి నేరుగా పెద్దాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు డీఎస్పీ వెల్లడించాడు.

#Son-in-law #Uncle #Murder #East Godavari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

East Godavari Uncle Murdered Son In Law Related Telugu News,Photos/Pics,Images..