వాట్సప్‌లో వచ్చిన న్యూస్‌ నిజమా? ఫేకా అనే విషయాన్ని సింపుల్‌గా ఇలా తెలుసుకోవచ్చు  

Easily To Find Out Whether Whatsapp News Fake Or Real-easy,fake,feature,find,forward,general Telugu Updates,news,real,whatsapp

పొద్దున లేవగానే వాట్సప్‌ చూడకుండా మనం డే మొదలు పెట్టం. వాట్సప్‌లో వచ్చిన మెసేజ్‌లు, స్నేహితులు పెట్టిన స్టేటస్‌లు చూసిన తర్వాత అప్పుడు డే అనేది ప్రారంభం అవుతుంది. మనం రోజు ఎన్నో మెసేజ్‌లను వాట్సప్‌ ద్వారా అందుకుంటూ ఉంటాం..

వాట్సప్‌లో వచ్చిన న్యూస్‌ నిజమా? ఫేకా అనే విషయాన్ని సింపుల్‌గా ఇలా తెలుసుకోవచ్చు-Easily To Find Out Whether Whatsapp News Fake Or Real

అయితే అందులో కొన్ని ఫేక్‌ కూడా ఉంటున్నాయి. కొందరు ఆకతాయిలు చేస్తున్న పనికి ఎంతో మంది మోసపోవడంతో పాటు, అది నిజమే అని మరి కొందరికి షేర్‌ చేస్తూ ఉంటారు. అయితే వాట్సప్‌ ఫేక్‌ న్యూస్‌ను ఎంతగా బ్యాన్‌ చేసేందుకు, ఎంతగా అరికట్టేందుకు ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కావడం లేదు.

ఇలాంటి సమయంలో ఒక థర్డ్‌ పార్టీ యాప్‌ వాట్సప్‌లో వచ్చే న్యూస్‌ నిజమా ఫేకా అనే విషయాన్ని తేల్చేందుకు మొదలైంది

మీకు వాట్సప్‌లో ఏదైనా న్యూస్‌ వచ్చినట్లయితే, దాన్ని వెంటనే మీరు నమ్మేయకండి. దాని గురించి తెలుసుకుని, ఆ తర్వాత అది నిజమా కాదా అనే విషయాన్ని నిర్థారించుకుని అప్పుడు దాన్ని నమ్మండి. అయితే అది నిజమా కాదా అనేది ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా, కొత్తగా ఒక సంస్థ వారు పలు భాషల్లో వైరల్‌ అవుతున్న న్యూస్‌ నిజమా కాదా అనే విషయాన్ని తెలియజేసేందుకు యాప్‌ను తయారు చేసింది.

ఆ యాప్‌ సాయంతో మీరు న్యూస్‌ను గురించి తెలుసుకోవచ్చు. మీకు వచ్చిన న్యూస్‌ నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు కింద చెప్పిన విధంగా ప్రయత్నించండి.

టిప్‌ లైన్‌ పీచర్‌ అంటూ ప్రారంభం అయిన దీనిలో మనకు వచ్చిన వాట్సప్‌ మెసేజ్‌ నిజమా కాదా అనే విషయాన్ని నిర్థారించుకోవచ్చు. ఎన్నికల నేపథ్యంలో తమ ప్రత్యర్థులపై కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

అందుకు వాట్సప్‌ను వాడుకుంటున్నారు. అందుకే అవాటి వాటిని అరి కట్టేందుకు ఈ ఫీచర్‌ వచ్చింది. మీకు వచ్చిన మెసేజ్‌ను +919643000888 కు ఫార్వర్డ్‌ చేయండి. ఇమేజ్‌ ఫార్మెట్‌లో ఉన్నా టెక్ట్స్‌ ఫార్మెట్‌లో ఉన్నా కూడా ఎలాంటి సమస్య లేకుండా మెసేజ్‌ ఆ నెంబర్‌కు పంపిస్తే ఆ న్యూస్‌ గురించిన పూర్తి వివరాలు మీకు వస్తాయి..

ప్రస్తుతం ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, బెంగాళీ, మలయాళం భాషల్లో ఈ ఫీచర్‌ పని చేస్తోంది. త్వరలోనే దేశం మొత్తంలో ఉన్న భాషలకు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.