భూకంపం, సునామి.. టర్కీలో ప్రకృతి విలయతాండవం..!  

earth quake tsunami natural disasters in turkey Tsunami, Turkey, Earthquake, Izmir City, Azian Sea, Greace, Buildings Colapse - Telugu Azian Sea, Buildings Colapse, Earth Quake Tsunami Natural Disasters In Turkey, Earthquake, Greace, Izmir City, Tsunami, Turkey

2020 సంవత్సరం మొదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక పెను ప్రమాదం సంభవిస్తూనే ఉంది.2019 చివరిన మొదలైన కరోనా వైరస్ వ్యాప్తి ఆ తర్వాత ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత కొన్ని దేశాల్లో అడవులు ఎకరాలకు ఎకరాలు కాలిపోవడం అందులో ఎన్నో జీవరాసులు అందులో మృతిచెందడం, ఆ తర్వాత మరో దేశంలో పెద్ద ఎత్తున భారీ పేలుడు సంభవించడం, అనేక దేశాల్లో పెద్దఎత్తున వరదలు సంభవించడం ఇలా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా టర్కీ, గ్రీసు దేశాలలో రిక్టర్ స్కేలుపై 7.0 భూకంప తీవ్రత నమోదయింది.అది కూడా సముద్రగర్భంలో రావడంతో సముద్రం మొత్తం అల్లకల్లోలమై చివరికి చిన్నపాటి సునామి ఏర్పడినట్లు అయింది.

TeluguStop.com - Earthquake Tsunami Natural Disasters In Turkey

ఇక టర్కీ దేశం లోని ఇజ్మీర్ లో 20 భవనాలకు పైగా కుప్పకూలాయి.కొన్ని బహుళ అంతస్తుల భవనాలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి.భూకంపం వచ్చిన సమయంలో సముద్రంలోని నీరు వెనక్కి వెళ్లడం అలాగే అలలు పూర్తిగా ముందుకు వచ్చి వేయడంతో ఇజ్మీర్ నగరం రూపురేఖలే మారిపోయాయి.ఆ సమయంలో ఒక్కసారిగా అలలు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయి అలా వెళ్లిన అలలు ఒకేసారి ముందుకు రావడంతో జనం ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన కొంతమంది ఈ పరిస్థితి నుంచి తప్పించుకున్నారు.అయితే జరగాల్సిన నష్టం మాత్రం బాగానే జరిగినట్లు కనబడుతోంది.

TeluguStop.com - భూకంపం, సునామి.. టర్కీలో ప్రకృతి విలయతాండవం..-General-Telugu-Telugu Tollywood Photo Image

టర్కీ దేశం దగ్గర ఏజియ‌న్ వద్ద ఉన్న ఈ సీన్ సముద్రంలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఏజియ‌న్ సముద్రంలో 16 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడినట్లు వారు తెలిపారు.

అంత లోతులో భూకంపం ఏర్పడిన అది ఇంతల ప్రభావం చూపడం మొదటిసారని అధికారులు తెలుపుతున్నారు.వారి అంచనాల ప్రకారం భూకంప తీవ్రత పెద్దగా అయిన సునామీ మాత్రం చాలా చిన్నదే.

కానీ, ఈ చిన్నసునామికే పెద్దపెద్ద బిల్డింగులు కోల్పోవడం జనం వాటిలో కొట్టుకుపోవడం లాంటి ఎన్నో సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.ప్రస్తుతం చిన్న సునామి అంటేనే ఇలా ఉంటే ఒకవేళ పెద్ద సునామీ వస్తే పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన పడుతున్నారు.

ప్రస్తుతం టర్కీ, గ్రీస్ దేశాలలో సముద్రతీరంలో ఉన్న ప్రజలు హడలిపోతున్నారు.ఇకపోతే భూకంపం సునామి వల్ల ఎంత ప్రాణనష్టం అలాగే ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఇప్పుడే అంచనా వేయలేం అంటున్నారు అధికారులు.

#EarthQuake #Azian Sea #Earthquake #Tsunami #Greace

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Earthquake Tsunami Natural Disasters In Turkey Related Telugu News,Photos/Pics,Images..