అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం! తప్పిన ప్రాణ నష్టం!

గత కొద్ది రోజులుగా ఫిలిపిన్స్, ఇండోనేసియా లాంటి తీరప్రాంత దేశాలని భూకంప భయపెడుతుంది.ఇక ఈ ఏడాది ప్రకృతి వైపరిత్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

 Earthquake In Arunachal Pradesh-TeluguStop.com

ఈ నేపధ్యంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు తీవ్రంగా భయపెడుతున్నాయి.తాజాగా ఈశాన్య భారత్‌లో భారీ భూకంపం సంభవించింది.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం వచ్చింది.రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు తెలిపారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలో భూ ప్రకంపనల తీవ్రతకు ప్రజలు భయంతో ఇళ్ళ నుంచి పరుగులు తీశారు.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు సమాచారం.అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న మయన్మార్‌, భూటాన్‌లో కూడా భూమి కంపించినట్లు సమాచారం.అయితే ఈ భూకంపం వలన కొంత ఆస్తి నష్టం నరిగిన ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube