ఒక పక్క కరోనా మరో పక్క భూకంపం...అల్లాడుతున్న అమెరికా...!!!

అమెరికా కరోనా తో అల్లాడిపోతోంది. కరోనా మహమ్మారి దెబ్బకి అమెరికా ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు.

 Idaho, Earthquake, Coronavirus, America, Covid19, Magnitude-TeluguStop.com

ప్రపంచంలో కరోన బాధిత దేశాలలో అమెరికా రెండవ స్థానంలో ఉండటం ఆ దేశాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది.అందుకు తగ్గట్టుగా ఆ దేశాధినేతలు అమెరికాలో సుమారు మరణాల సంఖ్య లక్షకి పైగా చరుకుంటుందని వార్తలు రావడంతో మరింత ఆందోళన కరమణ పరిస్థితులు నెలకొన్నాయి.

రోజు వ్యవధిలో వందల మరణాలు ఆదేశాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నేట్టేస్తున్నాయి.ఇదిలాఉంటే.

ఒక పక్క కరోనా అమెరికాలో విలయం సృష్టిస్తుంటే మరో పక్క తాజాగా జరిగిన భూకంప ఘటన భయభ్రాంతులకి గురిచేసింది.అమెరికా రాష్ట్రం ఇదాహో లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది.ఈ సందర్భంలో నేషనల్ వెదర్ సర్వీస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా బలమైన భూకంపం సంభవించిందని , గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం జరిగిందని పేర్కొంది.సుమారు 20-30 సెకన్ల పాటు తీవ్రంగా భూమి కంపించడంతో ఒక్క సారిగా ఇళ్ళల్లో ఉన్న ప్రజలు బయటకి పెరుగులు తీశారు.అయితే

Telugu America, Coronavirus, Covid, Earthquake, Idaho, Magnitude-

ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర గవర్నర్ అమెరికాని ఇప్పటికే కరోనా కాటేసిందని,.ఈ ప్రభావంతో ఇప్పటి వరకూ వేలాది మంది మృతి చెందారని, లక్షలాది మందికి కరోనా సోకి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నారని.ఈ క్రమంలోనే భూకంపం రావడం అమెరికా ప్రజలకి మరింత ఆందోళన కలిగించిందని అన్నారు.ఈ భూకంప ప్రభావాని అంచనా వేస్తున్నామని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube